వృద్ధి అంచనాను 9.2 శాతానికి తగ్గించిన బార్‌క్లేస్!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం మొదట ఊహించిన దానికంటే అధికంగా ఉందని, ఈ కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును 9.2 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. సెకెండ్ వేవ్ కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు విధించిన కఠిన ఆంక్షలు, ఆర్థిక కార్యకలాపాలు మందగించడం వంటి కారణాలతో ప్రధాన బ్యాంకులు, రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగి థర్డ్ వేవ్ […]

Update: 2021-05-25 06:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం మొదట ఊహించిన దానికంటే అధికంగా ఉందని, ఈ కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును 9.2 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. సెకెండ్ వేవ్ కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు విధించిన కఠిన ఆంక్షలు, ఆర్థిక కార్యకలాపాలు మందగించడం వంటి కారణాలతో ప్రధాన బ్యాంకులు, రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగి థర్డ్ వేవ్ గనక వస్తే, అందుకు అనుగుణంగా లాక్‌డౌన్ ఆంక్షలు, కఠిన నిబంధనలు అమలైతే భారత్‌కు అదనంగా మరో రూ. 3 లక్షల కోట్ల వరకు ఆర్థిక నష్టం తప్పదని బార్‌క్లేస్ అభిప్రాయపడింది. సెకెండ్ వేవ్ కారణంగా విధించిన కఠిన ఆంక్షల వల్లే నే నెలలో సుమారు రూ. 58 వేల కోట్ల నష్టం ఉంటుందని గతంలో బార్‌క్లేస్ అంచనా వేసింది.

జూన్‌తో ముగిసే త్రైమాసికంలో ఈ ఆర్థిక నష్టం భారీగా ఉంటుందని పేర్కొంది. అయితే, సెకెండ్ వేవ్ సద్దుమణిగితే జూన్ నుంచి పరిస్థితులు మెరుగ్గా ఉండొచ్చని బార్‌క్లేస్ ఆశాభావం వ్యక్తం చేసింది. దేశీయంగా టీకా పంపిణీ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని బార్‌క్లేస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ రాహుల్ బజొరియా అన్నారు. థర్డ్ వేవ్ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీనివల్ల మూడు, నాలుగో త్రైమాసికాల్లో మరోసారి రెండు నెలల లాక్‌డౌన్ అమలయ్యే అవకాశం ఉంది. అలాగే జరిగితే కరోనా కారణంగా జరిగే మొత్తం నష్టం జీడీపీలో 3.75 శాతానికి సమానమైన రూ. 8.5 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు.

Tags:    

Similar News