ఈరోజు, రేపు బ్యాంకులు బంద్..!
దిశ, వెబ్ డెస్క్: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు ఈరోజు, రేపు సమ్మెలో పాల్గొననున్నారు. ఇందులో 9 యూనియన్లు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) తెలిపింది. దీంతో ఈ రెండు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగనుంది. అయితే ఖాతాదారుల అవసరాల కోసం బ్యాంకు కార్యకలాపాలు […]
దిశ, వెబ్ డెస్క్: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు ఈరోజు, రేపు సమ్మెలో పాల్గొననున్నారు. ఇందులో 9 యూనియన్లు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) తెలిపింది. దీంతో ఈ రెండు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగనుంది. అయితే ఖాతాదారుల అవసరాల కోసం బ్యాంకు కార్యకలాపాలు యథావిధిగా జరిగేలా తగిన చర్యలు తీసుకొంటున్నట్టు కొన్ని బ్యాంకులు పేర్కొన్నాయి.