వసూలు చేసిన ఛార్జీలు తిరిగి చెల్లింపు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఆదివారం బ్యాంకులకు లేఖ ఇచ్చింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 269ఎస్‌యూ ప్రకారం డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు ఎటువంటి ఛార్జీలను వసూలు చేయకూడదని, ప్రస్తుత సంవత్సరంలో జనవరి 1నుంచి రూపే కార్డులు, బీహెచ్ఐఎం, యూపీఐల ద్వారా చేసిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన అన్ని ఛార్జీలను వెంటనే చెల్లించాలని స్పష్టం […]

Update: 2020-08-30 09:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఆదివారం బ్యాంకులకు లేఖ ఇచ్చింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 269ఎస్‌యూ ప్రకారం డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు ఎటువంటి ఛార్జీలను వసూలు చేయకూడదని, ప్రస్తుత సంవత్సరంలో జనవరి 1నుంచి రూపే కార్డులు, బీహెచ్ఐఎం, యూపీఐల ద్వారా చేసిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన అన్ని ఛార్జీలను వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది.

నగదు రహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు, డిజిటల్ లావాదేవీల పెంపునకు 2019లో కేంద్రం ఫైనాన్స్ యాక్ట్‌లో ఈ సెక్షన్‌ను జతచేసింది. యూపీఐ, బీహెచ్ఐఎం, రూపే కార్డులు, క్యూఆర్ కోడ్‌లను ఎలక్ట్రానిక్ వ్యవస్థలుగా పరిగణించింది. అందువల్ల డిజిటల్ రూపంలో చెల్లింపులు చేసిన వారి నుంచి వసూలు చేసిన ఛార్జీలను తక్షణమే తిరిగిచ్చేయాలని తెలిపింది. కాగా, నిర్దేశిత లావాదేవీలు దాటిన తర్వాత యూపీఐ చెల్లింపులపై పలు బ్యాంకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని సీబీడీటీ వరకు రావడంతో తాజా ఆదేశాలను ఇచ్చింది. అంతేకాకుండా, ఈ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ కూడా వర్తించదని పేర్కొంది.

Tags:    

Similar News