చరిత్ర సృష్టించిన బంగ్లా కుర్రాళ్లు

         బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా బంగ్లాదేశ్ నిలిచింది. తొలిసారి ఫైనల్ చేరిన బంగ్లా జట్టు ప్రత్యర్థి భారత్‌ ను మట్టికరిపించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ బౌలర్లు భారత బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు సైనీ రాణించడంతో 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ భారత బౌలర్లపై […]

Update: 2020-02-09 10:57 GMT

బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా బంగ్లాదేశ్ నిలిచింది. తొలిసారి ఫైనల్ చేరిన బంగ్లా జట్టు ప్రత్యర్థి భారత్‌ ను మట్టికరిపించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ బౌలర్లు భారత బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు సైనీ రాణించడంతో 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. 7 వికెట్ల నష్టానికి 170 పరుగుల చేసిన దశలో వర్షం కురవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్ జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో బంగ్లా జట్టు చరిత్ర సృష్టించింది. అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంతో బంగ్లాదేశీయులు ఆనందంలో మునిగిపోయారు.

Tags:    

Similar News