డబ్బుకోసం ముఠాగా.. చివరికి ఠాణా

దిశ, ఆదిలాబాద్: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాధించాలనుకున్నారు జల్సారాయులు. ఇందు కోసం తొమ్మిది మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ‘బ్యాంకాక్ లాటరీ’ పేరుతో అమాయకులను మోసగిస్తూ ఇప్పటికే లక్షల్లో దండుకున్నారు. ఈ ముఠా గుట్టు రట్టుకావడంతో శనివారం సాయంత్రం వారిని బెల్లంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జల్సాలకు అలవాటుపడిన బెల్లంపల్లికి చెందిన డొంగే శ్రావణ్, లింగంపల్లి రవి, పల్లపు మహేష్, అంబాల శివ సాయి, ఎరుకల ప్రమోద్, ఎంపీ తాజ్కల్, […]

Update: 2020-05-23 09:39 GMT

దిశ, ఆదిలాబాద్: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాధించాలనుకున్నారు జల్సారాయులు. ఇందు కోసం తొమ్మిది మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ‘బ్యాంకాక్ లాటరీ’ పేరుతో అమాయకులను మోసగిస్తూ ఇప్పటికే లక్షల్లో దండుకున్నారు. ఈ ముఠా గుట్టు రట్టుకావడంతో శనివారం సాయంత్రం వారిని బెల్లంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జల్సాలకు అలవాటుపడిన బెల్లంపల్లికి చెందిన డొంగే శ్రావణ్, లింగంపల్లి రవి, పల్లపు మహేష్, అంబాల శివ సాయి, ఎరుకల ప్రమోద్, ఎంపీ తాజ్కల్, మంతెన అజయ్, ఎస్కే అమీర్ ముఠాగా ఏర్పడి బ్యాంకాక్ లాటరీకి తెర తీశారు. ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మెసేజ్‌లు పంపుతూ పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ముఠా సభ్యులను శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదుతోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ రహమాన్ మీడియాకు వెల్లడించారు.

Tags:    

Similar News