కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బండి సంజయ్

దిశ, వెబ్‌డెస్క్: గత నాలుగు నెలలుగా సీఎం కేసీఆర్ వ్యవసాయ చట్టాలపై చేసిన విమర్శలు మార్చుకొని, కొత్త చట్టాలకు కితాబు ఇవ్వడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మేం గతేడాది నుంచే నియంత్రిత సాగు చేయడం తప్పని, ఈపద్ధతి ద్వారా రైతులు మరింత నష్టపోతారని, రైతులు వేసుకునే పంటలకు స్వేచ్ఛ ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరించారని అన్నారు. నియంత్రిత సాగుతో రైతులు తీవ్రంగా నష్టపోయినందున కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సంజయ్ […]

Update: 2020-12-27 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత నాలుగు నెలలుగా సీఎం కేసీఆర్ వ్యవసాయ చట్టాలపై చేసిన విమర్శలు మార్చుకొని, కొత్త చట్టాలకు కితాబు ఇవ్వడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మేం గతేడాది నుంచే నియంత్రిత సాగు చేయడం తప్పని, ఈపద్ధతి ద్వారా రైతులు మరింత నష్టపోతారని, రైతులు వేసుకునే పంటలకు స్వేచ్ఛ ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరించారని అన్నారు. నియంత్రిత సాగుతో రైతులు తీవ్రంగా నష్టపోయినందున కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లుతెరచి పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాలను తెలంగాణలో అమలు చేసేందుకు సంకేతాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

Tags:    

Similar News