విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా..?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్స్ రాక ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయడం లేదని కొద్ది రోజుల క్రితం కేయూలో పురుగుల మందు తాగి నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సునీల్ కుమార్ నాయక్ కుటుంబ సభ్యులను సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సునీల్ నాయక్ లాంటి పేద […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్స్ రాక ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయడం లేదని కొద్ది రోజుల క్రితం కేయూలో పురుగుల మందు తాగి నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సునీల్ కుమార్ నాయక్ కుటుంబ సభ్యులను సంజయ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సునీల్ నాయక్ లాంటి పేద విద్యార్థులు ఎంతోమంది రాష్ట్రంలో నోటిఫికేషన్స్ రాక ఇబ్బందులు పడుతున్నారన్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయనది ఆత్మహత్య కాదని ముఖ్యమంత్రి చేసిన హత్యగానే భావించాలన్నారు. సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగులు, విద్యార్థుల బాగోగుల గురించి అస్సలు పట్టడడం లేదన్నారు.
పిల్లలకు ఉద్యోగాలు రాకున్నా ఫర్వాలేదు కానీ, తన కుటుంబంలో ఉద్యోగాలుంటే చాలనే భావనలో ఆయనున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీలో కేసీఆర్ర్‌కు ఉద్యోగం ఉందని, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు,చి వరకు సడ్డకుని కుమారుడికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. మరి కష్టపడి చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటని..? వారికి ఉద్యోగాలు అవసరం లేదా..? అని నిలదీశారు. సునీల్ మాదిరే తెలంగాణలో ఎంతో మంది పిల్లలు చనిపోతున్నా.. సర్కారులో కనీసం చలనం లేదన్నారు.