బండి సంజయ్ కోసం ఆత్మహత్యాయత్నం

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ కార్యాలయం ముందు ఓ యువకుడు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రాణాపాయం తప్పింది. అతని శరీరం అప్పటికే 40 శాతం కాలిందని సమాచారం. బండి సంజయ్ ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని బాధిత యువకుడు వెల్లడించాడు. బండి సంజయ్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ కాలిన గాయాలతో తెలిపాడు. కాగా సదరు యువకుడు రంగారెడ్డి […]

Update: 2020-11-01 04:05 GMT
బండి సంజయ్ కోసం ఆత్మహత్యాయత్నం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ కార్యాలయం ముందు ఓ యువకుడు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రాణాపాయం తప్పింది. అతని శరీరం అప్పటికే 40 శాతం కాలిందని సమాచారం. బండి సంజయ్ ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని బాధిత యువకుడు వెల్లడించాడు. బండి సంజయ్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ కాలిన గాయాలతో తెలిపాడు. కాగా సదరు యువకుడు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News