TRS ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బిగ్ ట్విస్ట్

దిశ, వెబ్ డెస్క్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్ పేరు ఎమ్మెల్సీ రేసులో జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు ఆయనను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.  ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు అయిన నేతలు అధిష్టానం ఇచ్చిన సమాచారంతో ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో బండా ప్రకాష్ కూడా ప్రగతిభవన్‌కి చేరుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయను ఎమ్మెల్సీ ఖరారు అయిందని, […]

Update: 2021-11-15 23:57 GMT

దిశ, వెబ్ డెస్క్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్ పేరు ఎమ్మెల్సీ రేసులో జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు ఆయనను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు అయిన నేతలు అధిష్టానం ఇచ్చిన సమాచారంతో ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో బండా ప్రకాష్ కూడా ప్రగతిభవన్‌కి చేరుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయను ఎమ్మెల్సీ ఖరారు అయిందని, అందుకే ప్రగతిభవన్‌కు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బండా ప్రకాష్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేస్తున్నారు.

ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయగా.. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో ఇవాళ టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాసేపట్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బండా ప్రకాష్, వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి పేర్లు ఖరారు అయినట్లు సమాచారం.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

Tags:    

Similar News