అనుమతులున్న విమాన సేవలు యథాతథం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షెడ్యూల్డ్ ప్యాసింజర్ విమానాల సేవలపై నిషేధాన్ని కేంద్రం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. నిర్దేశిత మార్గాల్లో అనుమతులకు లోబడి సేవలందిస్తున్న విమానాలు యథావిధిగా నడుస్తాయని పేర్కొంది. వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుస్తున్న విమానాలు, ఇతర దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలు పెట్టుకుని మార్గాల్లోనూ విమాన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వీటితోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి పొందిన విమానాలు, కార్గో విమానాలపై ఆంక్షలుండవని వెల్లడించింది. కరోనా కట్టడికి […]
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షెడ్యూల్డ్ ప్యాసింజర్ విమానాల సేవలపై నిషేధాన్ని కేంద్రం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. నిర్దేశిత మార్గాల్లో అనుమతులకు లోబడి సేవలందిస్తున్న విమానాలు యథావిధిగా నడుస్తాయని పేర్కొంది. వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుస్తున్న విమానాలు, ఇతర దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలు పెట్టుకుని మార్గాల్లోనూ విమాన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వీటితోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి పొందిన విమానాలు, కార్గో విమానాలపై ఆంక్షలుండవని వెల్లడించింది. కరోనా కట్టడికి విధించిన తొలి లాక్‌డౌన్(మార్చి 23) నుంచి విమాన సేవలపై నిషేధాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి.