ఉలిక్కిపడ్డ దేశ రాజధాని.. ఢిల్లీలో భారీ పేలుడు!

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద సంభవించిన పేలుడులో పలు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బ్లాస్ట్ ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి […]

Update: 2021-01-29 07:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద సంభవించిన పేలుడులో పలు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది.

దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బ్లాస్ట్ ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News