భారత్ వరల్డ్ రికార్డులో బాలాపూర్ లడ్డు
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రతి ఏడాది జరిగే వినాయక ఉత్సవాలు దేశంలోని ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో ముంబై నగరం తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రేటర్ పరిధిలో ఉత్సవాలు మొదలైతే అందరూ మాట్లాడుకునేది ఖైరతాబాద్ విగ్రహం, బాలాపూర్ లడ్డూ గురించే. ఇప్పుడు ఆ బాలాపూర్ లడ్డూకు మరో ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. 26 ఏళ్లుగా నిర్విరామంగా వేలం పాటలో అధిక ధర పలుకుతున్నందుకు గానూ లడ్డూ […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రతి ఏడాది జరిగే వినాయక ఉత్సవాలు దేశంలోని ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో ముంబై నగరం తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రేటర్ పరిధిలో ఉత్సవాలు మొదలైతే అందరూ మాట్లాడుకునేది ఖైరతాబాద్ విగ్రహం, బాలాపూర్ లడ్డూ గురించే. ఇప్పుడు ఆ బాలాపూర్ లడ్డూకు మరో ప్రత్యేక గుర్తింపు దక్కనుంది.
26 ఏళ్లుగా నిర్విరామంగా వేలం పాటలో అధిక ధర పలుకుతున్నందుకు గానూ లడ్డూ భారత్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకోనుంది. ఈ విషయాన్ని భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి కేవీ రామారావు వెల్లడించారు. ఉత్సవ సమితితో చర్చించి రికార్డు పత్రాల్ని అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది కరోనా కారణంగా లడ్డూ వేలాన్ని రద్దు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. అయితే ఈసారి విగ్రహం ఆరు అడుగులకే పరిమితం అవుతుండగా.. లడ్డూ ఎప్పటిలాగే 21 కిలోలు పెట్టనున్నారు.