మూడోసారి 'చేతక్' స్కూటర్ ధర పెంచిన బజాజ్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘చేతక్’ ధరను భారీగా పెంచుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఏడాది ఈ స్కూటర్ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తాజాగా పెంచిన ధరలతో భారత్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చేతక్ మోడల్ నిలిచిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఈ స్కూటర్ ధర(ఎక్స్‌షోరూమ్) రూ. 1,44,987 ఉండగా, ప్రస్తుతం ఇది రూ., 1,87,390గా ఉంది. గతేడాది […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘చేతక్’ ధరను భారీగా పెంచుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఏడాది ఈ స్కూటర్ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తాజాగా పెంచిన ధరలతో భారత్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చేతక్ మోడల్ నిలిచిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఈ స్కూటర్ ధర(ఎక్స్‌షోరూమ్) రూ. 1,44,987 ఉండగా, ప్రస్తుతం ఇది రూ., 1,87,390గా ఉంది. గతేడాది భారత మార్కెట్లో లాంచ్ చేసిన ఈ స్కూటర్ ధర ఇప్పటివరకు 60 శాతానికి పైగా పెరగడం విశేషం. కేంద్రం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఫేమ్-2 పథకానికి సంబంధించి సబ్సీడీ పెంచడంతో బజాజ్ కంపెనీ మళ్లీ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. ఫేమ్-2 ద్వారా సంస్థకు రూ. 45 వేల సబ్సీడీ లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో చేతక్ తర్వాత ఓలా ఎస్ 1 ప్రో, ఆథర్ ఎనర్జీకి చెందిన ఆథర్ 450ఎక్స్ మోడల్ స్కూటర్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. చేతక్ స్కూటర్ ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలలో కొనేందుకు అందుబాటులో ఉంది.