‘జూన్ నెల వేతనం పూర్తిగా చెల్లించాలి’
దిశ, న్యూస్ బ్యూరో: అత్యంత భయంకరమైన కరోన మహమ్మారి ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సగం వేతనంతో సమస్యలు సృష్టించి జీవితాలతో ఆడుకుంటుందని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉండటమే పాపం అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఏం పాపం చేశారని వారి జీవితాలతో ఆడుకుంటున్నరని ప్రశ్నించారు. గత నెలలో ఒక ఉపాధ్యాయుడు అప్పుల బాధతో ఉరేసుకుని […]
దిశ, న్యూస్ బ్యూరో: అత్యంత భయంకరమైన కరోన మహమ్మారి ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సగం వేతనంతో సమస్యలు సృష్టించి జీవితాలతో ఆడుకుంటుందని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉండటమే పాపం అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఏం పాపం చేశారని వారి జీవితాలతో ఆడుకుంటున్నరని ప్రశ్నించారు. గత నెలలో ఒక ఉపాధ్యాయుడు అప్పుల బాధతో ఉరేసుకుని చనిపోయిన సంఘటన మరువక ముందే గురువారం గోదావరిఖని విఠల్‌నగర్‌లో రాంబాబు అనే ఉపాధ్యాయుడు ఉరేసుకున్నాడన్నారు. ఈ చావులు ఆపాలని వెంటనే ఉద్యోగుల వేతనాలు చెల్లించి వారిని ఆదుకోవాలని కల్పదర్శి చైతన్య డిమాండ్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులను ఆదుకోవాలని, ముఖ్యంగా ప్రభుత్వం సరెండేర్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని, ఫ్రీజింగ్ పేరుతో అన్నిరకాల బిల్లులు అపి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.