పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు పంపిణీ

దిశ, నల్గొండ: లాక్‌డౌన్ ముగిసే వరకు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, స్వీయ నియంత్రణ పాటించాలని రాజ్యసభ్య సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో తన సొంత ఖర్చులతో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ […]

Update: 2020-04-23 07:40 GMT

దిశ, నల్గొండ: లాక్‌డౌన్ ముగిసే వరకు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, స్వీయ నియంత్రణ పాటించాలని రాజ్యసభ్య సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో తన సొంత ఖర్చులతో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ నెమ్మది భిక్షం, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags: Badulgula Lingaiah Yadav, Distribution, Sanitizer, suryapet

Tags:    

Similar News