ఆన్‌లైన్ టికెట్స్ అవైలబుల్

దిశ,వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌లో భద్రాద్రి శ్రీరామనవమి టికెట్లు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకానికి ఆన్‌లైన్‌లో టికెట్లను అధికారులు విక్రయిస్తున్నారు. ఉదయం 5గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 13-27వరకు శ్రీరామ నవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21న సీతారాముల కళ్యాణం, 22న పట్టాభిషేకం ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకానికి 20వేల టికెట్లను అధికారులు విక్రయించారు. ఆన్‌లైన్‌లో రూ.5వేలు, రూ. 2వేలు, రూ.1,116, రూ.500, రూ. 200, రూ.100 టికెట్లు […]

Update: 2021-03-04 21:20 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌లో భద్రాద్రి శ్రీరామనవమి టికెట్లు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకానికి ఆన్‌లైన్‌లో టికెట్లను అధికారులు విక్రయిస్తున్నారు. ఉదయం 5గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 13-27వరకు శ్రీరామ నవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21న సీతారాముల కళ్యాణం, 22న పట్టాభిషేకం ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకానికి 20వేల టికెట్లను అధికారులు విక్రయించారు. ఆన్‌లైన్‌లో రూ.5వేలు, రూ. 2వేలు, రూ.1,116, రూ.500, రూ. 200, రూ.100 టికెట్లు అందుబాటులో ఉంచారు. టికెట్లను www. bhadrachalamonline.com వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News