ఇంకెన్నాళ్లీ రోదనలు.. చెత్తకుండీల్లో చిన్నారులా..?

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలంలో మానవత్వం మంట కలిసిన ఘటన ఒకటి సోమవారం రాత్రి వెలుగుచూసింది. స్థానిక బస్టాండ్ ఏరియాలోని ఓ చెత్తకుండీ పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఎవరో వదిలేసి వెళ్ళారు. అటుగా వస్తున్న నలుగురు యువకులు చిన్నారి ఏడుపు విని చెత్తకుండీ పక్కన పడి ఉన్న శిశువుని గుర్తించి వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రిలో ఆ శిశువుకు వైద్యం అందిస్తున్నారు.‌ ప్రస్తుతానికి పసికందు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యం […]

Update: 2021-09-13 22:08 GMT

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలంలో మానవత్వం మంట కలిసిన ఘటన ఒకటి సోమవారం రాత్రి వెలుగుచూసింది. స్థానిక బస్టాండ్ ఏరియాలోని ఓ చెత్తకుండీ పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఎవరో వదిలేసి వెళ్ళారు. అటుగా వస్తున్న నలుగురు యువకులు చిన్నారి ఏడుపు విని చెత్తకుండీ పక్కన పడి ఉన్న శిశువుని గుర్తించి వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

ఆసుపత్రిలో ఆ శిశువుకు వైద్యం అందిస్తున్నారు.‌ ప్రస్తుతానికి పసికందు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యం అందించిన డాక్టర్ కె. విజయ్ తెలిపారు. చిన్నారిని చెత్తకుండీ దగ్గర పడేయడం వలన ఇన్‌‌ఫెక్షన్స్ సోకే అవకాశం ఉన్నందున తగిన చికిత్స చేస్తున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News