దంతాలతో పుట్టిన పసికందు

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో మానవ జన్మలోనూ ఎన్నో వింతలు, విడ్డురాలు జరుగుతున్నాయి. ఇలాంటి అరుదైన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆస్పత్రి ఈ వింతకు వేదికైంది. అప్పుడే పుట్టిన పిల్లలు బోసినోరుతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. కానీ ఈ ఆస్పత్రిలో గురువారం జన్మించిన ఓ పసికందు రెండు పళ్లు ఉన్నాయి. దీంతో పాప తల్లిదండ్రులు అవాక్కైయ్యారు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలకు పళ్లు […]

Update: 2020-07-09 09:03 GMT

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో మానవ జన్మలోనూ ఎన్నో వింతలు, విడ్డురాలు జరుగుతున్నాయి. ఇలాంటి అరుదైన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆస్పత్రి ఈ వింతకు వేదికైంది. అప్పుడే పుట్టిన పిల్లలు బోసినోరుతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. కానీ ఈ ఆస్పత్రిలో గురువారం జన్మించిన ఓ పసికందు రెండు పళ్లు ఉన్నాయి. దీంతో పాప తల్లిదండ్రులు అవాక్కైయ్యారు.

సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలకు పళ్లు ఉండవు. ఆరు నెలల తర్వాత చిన్నగా వస్తుంటాయి. కానీ గద్వాలలో జన్మించిన పసికందు రెండు ముందు పళ్లతో పుట్టడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కాగా ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ వరలక్ష్మి, ఓటీ అసిస్టెంట్ హరికృష్ణ తెలిపారు.

Tags:    

Similar News