వృద్ధ జంట కన్నీరు తుడిచిన సోషల్ మీడియా..

దిశ, వెబ్ డెస్క్ : కరోనా.. కడుపు మాడుస్తోంది, కన్నీరు పెట్టిస్తోంది, బతుకును భారంగా చేస్తోంది. వైరస్ భయంతో స్ట్రీట్ ఫుడ్ తినేందుకు కూడా ప్రజలు భయపడుతుండటంతో చిన్న వ్యాపారులకు కన్నీరే దిక్కవుతోంది. చేసిన ఆహారం పాడై పోవడంతో పాటు కస్టమర్లు రాక, బిజినెస్ నడవక ఆర్థికంగా చితికిపోతూ.. బతుకు బండిని ఈడ్చేందుకు పెట్టిన బండి పక్కనే కూర్చుని రోదిస్తున్నారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి దృశ్యాలే కనబడుతుండగా.. ఢిల్లీలోని మాల్వే నగర్‌లో ఉన్న ‘బాబా […]

Update: 2020-10-08 02:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : కరోనా.. కడుపు మాడుస్తోంది, కన్నీరు పెట్టిస్తోంది, బతుకును భారంగా చేస్తోంది. వైరస్ భయంతో స్ట్రీట్ ఫుడ్ తినేందుకు కూడా ప్రజలు భయపడుతుండటంతో చిన్న వ్యాపారులకు కన్నీరే దిక్కవుతోంది. చేసిన ఆహారం పాడై పోవడంతో పాటు కస్టమర్లు రాక, బిజినెస్ నడవక ఆర్థికంగా చితికిపోతూ.. బతుకు బండిని ఈడ్చేందుకు పెట్టిన బండి పక్కనే కూర్చుని రోదిస్తున్నారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి దృశ్యాలే కనబడుతుండగా.. ఢిల్లీలోని మాల్వే నగర్‌లో ఉన్న ‘బాబా కా దాబా’లోనూ వ్యాపారం సాగక కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధ జంటను చూశాడు ఓ నేషనల్ చానల్ రిపోర్టర్.

తను చేసిన వంటకాలకు ఫిదా అయిన రిపోర్టర్.. ఇలాంటి ఐటమ్స్ ఫైవ్ స్టార్ హోటల్‌లో కూడా దొరకవని, కానీ ఇంత మంచి మెనూ ప్రిపేర్ చేసిన వృద్ధ వ్యాపారుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని వివరించడంతో పాటు ఆ దాబా అడ్రస్ చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. చుట్టుపక్కల ఉన్నవారు “బాబా కా దాబా”కు విచ్చేసి భోజనం చేసి.. వారికి సపోర్ట్ చేయాలని కోరారు. ఈ వీడియోను బాలీవుడ్ సెలబ్రిటీస్ సునీల్ శెట్టి, స్వర భాస్కర్, అనుభవ్ సిన్హా లాంటి వారు కూడా షేర్ చేస్తూ.. వారి మొహాల్లో చిరు నవ్వు తెప్పించేందుకు మన వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. మన వ్యాపారులకు మన సాయం అవసరముందని.. ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో కొన్ని గంటల్లోనే ఢిల్లీ వాసులు “బాబా కా దాబా” దర్శనం చేసుకుని.. భోజనం చేసి ఆ వృద్ధుల వ్యాపారానికి సపోర్ట్ చేశారు. ప్రస్తుతం దాబా కస్టమర్లతో కిటకిటలాడుతుండగా.. వారి ముఖాలు చిరునవ్వుతో నిండిపోయాయి. ముఖ్యంగా ఆ దాబాకు వెళ్లిన యంగ్‌స్టర్స్ వృద్దులతో కలిసిపోయి ఫోటోలు దిగారు.. నవ్వుతూ, నవ్విస్తూ ప్రేమను పంచారు. బాబా కా దాబాలో ఉన్నామని, లవ్‌ను సర్వ్ చేస్తున్నామని చెప్తూ పిక్స్ షేర్ చేస్తున్నారు. మీరు కూడా విచ్చేయాలని.. లేందంటే మీ దగ్గర్లో ఉన్న ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలకు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు.

https://twitter.com/ReallySwara/status/1313952907977465856?s=19

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం, పొరుగు వాడికి కాసింత సాయం చేయాలనే భావన ఆ వృద్ధ జంట కన్నీటిని చిరునవ్వుగా మార్చగా.. ఇందులో కీలక పాత్ర పోషించింది ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియానే అని ఒప్పుకోక తప్పదు.

Tags:    

Similar News