నటించగలరు… కానీ, "జీవించలేరు"!
దిశ, వెబ్ డెస్క్: నాటకం.. చరిత్రను స్పృశిస్తూ… అందులోని తప్పు ఒప్పులను ఎత్తి చూపుతుంది. తద్వారా మనిషిలో మార్పుకు కారణం అవుతుంది. ఒత్తిడితో అలిసిన మనసుకు, శరీరానికి కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. సాహిత్యం, సంగీతం కలగలసిన నాటకం… రాజుల కాలంలో మంచి ఆదరణ పొందింది. కానీ కాలక్రమేణా టీవీలు, సినిమాలు వచ్చి నాటకం కనుమరుగు అవుతున్నా సరే…. నాటకానికి ఉన్న గొప్ప తనం నాటకానిదే అని సినీరంగం కూడా ప్రశంసిస్తుంది. నాటక రంగ కళాకారుడిని… సినిమా నటులను […]
దిశ, వెబ్ డెస్క్: నాటకం.. చరిత్రను స్పృశిస్తూ… అందులోని తప్పు ఒప్పులను ఎత్తి చూపుతుంది. తద్వారా మనిషిలో మార్పుకు కారణం అవుతుంది. ఒత్తిడితో అలిసిన మనసుకు, శరీరానికి కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. సాహిత్యం, సంగీతం కలగలసిన నాటకం… రాజుల కాలంలో మంచి ఆదరణ పొందింది. కానీ కాలక్రమేణా టీవీలు, సినిమాలు వచ్చి నాటకం కనుమరుగు అవుతున్నా సరే…. నాటకానికి ఉన్న గొప్ప తనం నాటకానిదే అని సినీరంగం కూడా ప్రశంసిస్తుంది. నాటక రంగ కళాకారుడిని… సినిమా నటులను పోల్చితే గొప్ప ప్రతిభావంతులు మాత్రం నాటక కళాకారులే అంటారు. కానీ ఏం చేస్తాం? ఎంత ప్రతిభ ఉన్నా… సినిమా వారు సంపాదించే సంపాదనను పొందలేరు కదా. కొన్ని సార్లు మూడు పూటల భోజనం చేసేందుకు కూడా సంపాదన సరిపోదు అంటారు. అయినా సరే… కళను కాదని బతకలేమని… కళను బతికించుకివడమే మా బతుకని చెబుతారు. ఇలాంటి నాటకాలు వేయడంలో సుప్రసిద్ధులు సురభి థియేటర్స్ వారు. దాదాపు 128 ఏళ్లుగా నాటక రంగానికి పరిమితమైన ఈ కుటుంబం… ప్రత్యేకమైన స్పెషల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన లైటింగ్ స్కీమ్‌లతో పౌరాణిక నాటకాలకు పేరుగాంచింది.సూక్ష్మంగా అన్వయించిన మేకప్, రంగురంగుల బ్యాక్‌డ్రాప్‌లు, ఆకర్షణీయమైన దుస్తులు మరియు వినూత్న ఆలోచన ద్వారా సృష్టించబడిన మేజిక్ సురభి యొక్క బలము. ప్రేక్షకులను తన మాయా ప్రపంచానికి తీసుకెళ్ళి… ఆ ప్రపంచంలో జీవించేలా చేయడం సురభి ప్రత్యేకత.
కానీ అలాంటి సురభి థియేటర్ ఆర్టిస్ట్ లు కష్టకాలంలో ఉన్నారు. కరోనా కారణంగా కడుపు నిండా తిండికి నోచుకోలేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. నాటకాన్ని నమ్ముకుని బతుకుతున్న 50 మంది కుటుంబ సభ్యులు ఒకేసారి ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ఈ కుటుంబంలో పిల్లలు, వృద్ధులు కూడా ఉండడం… ప్రాథమిక అవసరాలను కూడా పొందలేక పోవడం దయనీయం. ఇలాంటి కష్టసమయంలో వారిని ఆదుకోవాలని కోరుతూ బాహుబలి మూవీ టీం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సురభి నాటక కళాకారులు కష్టాల్లో ఉన్నారని… వారికి మీ ఆపన్న హస్తం అందించాలని బ్యాంక్ డీటెయిల్స్ పోస్ట్ చేసింది.
Tags : Surabhi Theatres, Bahubali Movie team, CoronaVirus, Corona, Covid19