జాబ్ లేదని యువకుడి ఆత్మహత్య

  దిశ, మేడ్చల్ : ఎన్నిమార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని మనస్తాంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మియాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..విశాఖకు చెందిన బలరాం మోహన్ మిత్రులతో కలిసి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. బీటెక్ పూర్తయి చాలా రోజులు గడిచినా సరైన ఉద్యోగం రావడం లేదని దిగులు పడేవాడు.తనపై ఆధారపడ్డ కన్నతల్లిని సరిగా చూసుకోలేకపోతున్నాననే మనోవేదనకు గురైన యువకుడు మియాపూర్ […]

Update: 2020-03-10 09:20 GMT

 

దిశ, మేడ్చల్ : ఎన్నిమార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని మనస్తాంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మియాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..విశాఖకు చెందిన బలరాం మోహన్ మిత్రులతో కలిసి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. బీటెక్ పూర్తయి చాలా రోజులు గడిచినా సరైన ఉద్యోగం రావడం లేదని దిగులు పడేవాడు.తనపై ఆధారపడ్డ కన్నతల్లిని సరిగా చూసుకోలేకపోతున్నాననే మనోవేదనకు గురైన యువకుడు మియాపూర్ ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ లోని 13వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బలరాం మృతిపై స్పందించిన మిత్రులు చదువుకు తగ్గ జాబ్ రాలేదని డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags: no job, student suicide, jumped from building, case file by miyapur police

Tags:    

Similar News