ఆలోచింపజేస్తున్న ‘ఆయుష్మాన్’ పోస్ట్!
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లో మనీషా వాల్మీకి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మనీషాపై అత్యాచారం చేసిన మృగాలు తమ పేర్లు చెప్పకూడదని నాలుక కోసి, నడుము విరగ్గొట్టి తనను ఓ ఆటోలో ఇంటికి పంపించారు. ఈ ఘటనలో మనీషాకు న్యాయం జరగాలని ఆందోళనలు జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే జమ్మూ కశ్మీర్‌లో మరో యువతిపై రేప్ జరిగింది. దోషులకు శిక్షలు పడినా సరే.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? […]
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లో మనీషా వాల్మీకి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మనీషాపై అత్యాచారం చేసిన మృగాలు తమ పేర్లు చెప్పకూడదని నాలుక కోసి, నడుము విరగ్గొట్టి తనను ఓ ఆటోలో ఇంటికి పంపించారు. ఈ ఘటనలో మనీషాకు న్యాయం జరగాలని ఆందోళనలు జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే జమ్మూ కశ్మీర్‌లో మరో యువతిపై రేప్ జరిగింది. దోషులకు శిక్షలు పడినా సరే.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటే బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఓ నిజం చెప్తూ పోస్ట్ పెట్టాడు.
‘మనం ఎప్పుడు కూడా ఎంతమంది అమ్మాయిలు రేప్ చేయబడ్డారనే లెక్కలు వేస్తాం తప్ప.. ఎంతమంది రేపిస్టులు అని కౌంట్ చేయం. ఎంతమంది టీనేజ్ అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యారనే మాట్లాడతాం తప్ప.. ఇందుకు కారకులైన టీనేజ్ అబ్బాయిలు ఎంత మంది ఉన్నారనేది అసలు లెక్కలోకి తీసుకోం. ఇలాంటి పాసివ్ వాయిస్ రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో మనం చూడొచ్చు’ అన్నారు ఆయుష్మాన్. వాయిలెన్స్ అగైనెస్ట్ వుమెన్ అనే పదం కూడా సమస్యాత్మకంగానే ఉందన్న ఆయన.. ఇది నిష్క్రియాత్మక నిర్మాణం అని.. ఇందులో క్రియాశీల ఏజెంట్ ( తప్పు చేసిన వ్యక్తి) గురించి మాట్లాడడం లేదని అన్నారు. ఇది మహిళలకు జరుగుతున్న అన్యాయమన్న ఆయుష్మా న్.. ‘వాయిలెన్స్ అగైనెస్ట్ ఉమెన్’ అనే పదంలో అసలు ఎవరు వారికి చెడు చేయడం లేనట్లుగానే ఉందని.. అసలు పురుషులు అనే వారు ఇందులో పార్ట్ కానట్లే ఉందని అన్నారు. వాయిలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అనేది పురుషుల పనే అన్నారు.
కాగా ఈ పోస్ట్‌పై స్పందించారు సెలబ్రిటీలు. ఇది నిజం అని.. సమాజంలో మార్పు రావాలని కోరుతున్నారు. కాగా దాదాపు సెలెబ్రిటీస్ అందరి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోనూ ఇదే పోస్ట్ షేర్ అయింది.