దేశం మొత్తం మందు పంపిణీ చేస్తా : ఆనందయ్య

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కరోనా బాధితులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణపట్నంలో పోలీసులు భారీగా మోహరించి, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీనిపై ఆనందయ్య స్పందించారు. ‘‘మందు పంపిణీకి రాష్ట్రంలోని అన్ని పార్టీలు సహకరించాయి. మా నాన్న చిన్న రైతు. నేను వ్యాపారం చేసేవాడిని. రియల్ ఎస్టేట్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి తీవ్రంగా […]

Update: 2021-05-31 22:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కరోనా బాధితులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణపట్నంలో పోలీసులు భారీగా మోహరించి, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీనిపై ఆనందయ్య స్పందించారు. ‘‘మందు పంపిణీకి రాష్ట్రంలోని అన్ని పార్టీలు సహకరించాయి. మా నాన్న చిన్న రైతు. నేను వ్యాపారం చేసేవాడిని. రియల్ ఎస్టేట్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయాను. దీంతో వ్యాపారాలపై నమ్మకం పోయింది. అందుకే ఆయుర్వేదం నేర్చుకున్నాను. మందు నిలిపివేసిన ప్రభుత్వం నిన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ సహకారంతో మందు పంపిణీ చేస్తాను. ప్రస్తుతం కావాల్సిన మూలికలను సిద్ధం చేసుకుంటున్నాను. దయచేసి పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఎవరూ మందుకోసం రావొద్దు. అధికారుల సహకారంతో మందు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. దేశం మొత్తం మందు పంపిణీ చేస్తాను.’’ అని ఆనందయ్య అన్నాడు.

Tags:    

Similar News