దేశ ప్రజలకు RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక పిలుపు
అయోధ్య రామమందిరం ప్రారంభం వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భావోద్వేగానికి గురయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరం ప్రారంభం వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భావోద్వేగానికి గురయ్యారు. ఆలయ ప్రారంభం అనంతరం వచ్చిన ప్రముఖులను ఉద్దేశించిన భగవత్ ప్రసంగించారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత రాముడు మళ్లీ తిరిగి వచ్చాడని అభిప్రాయపడ్డారు. రాముడి సంకల్పం అందరికీ ఆదర్శమని తెలిపారు. ఇక నుంచి చిన్న చిన్న వివాదాలపై ఘర్షణలు పడటం ఆపాలని పిలుపునిచ్చారు. రామాయణం, మహాభారతం కూడా ఇదే విషయాన్ని చెప్పాయని గుర్తుచేశారు.
ప్రజలంతా సోదరభావంతో మెలగడమే బ్రహ్మసత్యం అని చెప్పారు. రాముడి నుంచి కరుణ, పరోపకారం నేర్చుకోవాలని సూచించారు. అసలు ఈ మహత్తర ఘట్టాన్ని వర్ణించడానికి తనకు మాటలు రావడం లేదని ఎమోషనల్ అయ్యారు. కష్టకాలంలో ప్రపంచానికి ఇది దిక్సూచి అని అన్నారు. ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రధాని మోడీ కఠోర దీక్ష చేపట్టారని చెప్పారు. 11 రోజుల సుదీర్ఘ ఉపవాసం చేపట్టారని తెలిపారు. మోడీ గొప్ప తపస్వీ అని కొనియాడారు.