Ayodhya Ram Mandir : అయోధ్య భక్తులకు అలర్ట్.. దర్శనం వేళల్లో మార్పులు
అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులకు దర్శన ప్రవేశం కల్పించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులకు దర్శన ప్రవేశం కల్పించిన విషయం తెలిసిందే. కాగా మొదటి రోజు ఏకంగా 5 లక్షలకు పైగా భక్తులు బాల రామున్ని దర్శించుకున్నారు. దీంతో అయోధ్యకు తొలిరోజు భారీగా విరాళాలు వచ్చాయి. వాటిని లెక్కించడానికి రెండు రోజుల సమయం పట్టగా.. వాటి విలువ 3. 17 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే రోజు రోజుకు అయోధ్యకు భక్తుల రద్ధీ పెరిగిపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దీంతో అధికారులు అయోధ్య వైపు వస్తున్న అన్ని వాహనాలను నిలిపివేస్తున్నారు.
అయినప్పటికి లక్షల్లో భక్తులు అయోధ్యకు వచ్చి చేరుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారుల అయోధ్యకు వచ్చే.. విమానాలు, బస్సులు, రైళ్ల సర్వీసులను తగ్గించారు. కానీ భక్తులు ప్రైవేటు వాహనాల్లో భారీగా అయోధ్యకు చేరుకుంటున్నారు. దీంతో అయోధ్య ఆలయ అధికారులు శ్రీరాముని దర్శనం సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే అయోధ్యకు వచ్చే సెలబ్రేటీలు, వీఐపీలు వారం ముందే సమాచారం అందించాలని, ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీలకు ఎటువంటి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయలేదని చెప్పారు.