క్షీణించిన యాక్సిస్ బ్యాంక్ లాభాలు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 36 శాతం తగ్గి రూ. 1,117 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,757 కోట్ల లాభాలను ఆర్జించింది. ఖర్చులు, ప్రొవిజనింగ్ ఛార్జీల కారణంగా రూ. 1,050 కోట్ల లాభాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు నిర్వహణ లాభం 6 శాతం పెరిగి రూ. 6,096 కోట్లకు […]

Update: 2021-01-27 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 36 శాతం తగ్గి రూ. 1,117 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,757 కోట్ల లాభాలను ఆర్జించింది. ఖర్చులు, ప్రొవిజనింగ్ ఛార్జీల కారణంగా రూ. 1,050 కోట్ల లాభాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు నిర్వహణ లాభం 6 శాతం పెరిగి రూ. 6,096 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ. 7,373 కోట్లుగా ఉందని, నికర వడ్డీ మార్జిన్ 3.59 శాతానికి పెరిగిందని ఎక్స్చేంజీలో పేర్కొంది. ఈ త్రైమాసికంలో స్థూల నిరర్ధ ఆస్తులు(ఎన్‌పీఏ) 3.44 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 4.18 శాతం కంటే తక్కువగా నమోదైంది. అదేవిధంగా డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు మొత్తం కేటాయింపు రూ. 4,604.28 కోట్లుగా నివేదించింది.

Tags:    

Similar News