మ్యాక్స్ లైఫ్‌లో యాక్సిస్ బ్యాంక్ వాటా కొనుగోలు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో సరికొత్త ఒప్పందాల గురించి తెలుసుకుంటున్నాం. తాజాగా, యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో 29 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ లైఫ్ మధ్య వ్యూహాత్మ భాగస్వామ్యంతో బ్యాంక్ వాటా 30 శాతానికి చేరనుంది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 72.5 శాతం వాటాను కలిగి ఉంది. మ్యాక్స్ లైఫ్‌లో జపాన్‌కు చెందిన మిత్సుయ్ సుమితోమో ఇన్సూరెన్స్‌కు 21.87 శాతం వాటా ఉంది. మంగళవారం […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో సరికొత్త ఒప్పందాల గురించి తెలుసుకుంటున్నాం. తాజాగా, యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో 29 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ లైఫ్ మధ్య వ్యూహాత్మ భాగస్వామ్యంతో బ్యాంక్ వాటా 30 శాతానికి చేరనుంది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 72.5 శాతం వాటాను కలిగి ఉంది. మ్యాక్స్ లైఫ్‌లో జపాన్‌కు చెందిన మిత్సుయ్ సుమితోమో ఇన్సూరెన్స్‌కు 21.87 శాతం వాటా ఉంది.
మంగళవారం కుదిరిన ఒప్పందం అనంతరం మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్ మధ్య 70:30 జాయింట్ వెంచర్ అవుతుంది. ఈ ఒప్పందానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), సీసీఐ ఆమోదం ఇంకా లభించలేదు. వీటి అంగీకారం పూర్తయిన తర్వాతే ఈ ఒప్పందం ఖరారవుతుంది. దేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు. ఇక మ్యాక్స్ లైఫ్ నాలుగో అతిపెద్ద ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ రెండు సంస్థల మధ్య దశాబ్ద కాలం నుంచి చక్కని సానుకూల వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 19 లక్షల మందికి పైగా వినియోగదారులకు లాంగ్ టర్మ్ సేవింగ్, ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నాయి. ఈ రెండు సంస్థల ద్వారా వచ్చే ప్రీమియం మొత్తం రూ.38 వేల కోట్లకు పైగానే ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ ఈ ఒప్పందం గురించి స్పందిస్తూ..లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో అనేక అవకాశాలున్నాయి. తాజా ఒప్పందంతో వాటాదారులకు ప్రయోజనం ఉంటుంది. ఈ ఒప్పందంతో రెండు సంస్థల మధ్య వ్యాపార భాగస్వామ్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
Tags: Axis Bank, Max Life Insurance, stake in max life