మెంటల్ హెల్త్.. కరోనా భయాలు, అపోహలపై అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్

దిశ, ఫీచర్స్ : ‘మానసిక రోగానికి మందులేదు’ అనే మాటను వినే ఉంటారు. నిజమే! మనిషికి తగిలిన దెబ్బలు మానాలంటే మందులున్నాయేమో గానీ, మనసులో కలిగిన అలజడిని తగ్గించే ఔషధాలైతే లేవు. అందుకే మానసిక ఆరోగ్యం సరిగా ఉంటే, సగం రోగాలు దూరమైనట్టే. కానీ ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. మనుషుల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతండటంతో చాలామంది కుటుంబ సభ్యులను, […]

Update: 2021-05-02 11:25 GMT

దిశ, ఫీచర్స్ : ‘మానసిక రోగానికి మందులేదు’ అనే మాటను వినే ఉంటారు. నిజమే! మనిషికి తగిలిన దెబ్బలు మానాలంటే మందులున్నాయేమో గానీ, మనసులో కలిగిన అలజడిని తగ్గించే ఔషధాలైతే లేవు. అందుకే మానసిక ఆరోగ్యం సరిగా ఉంటే, సగం రోగాలు దూరమైనట్టే. కానీ ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. మనుషుల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతండటంతో చాలామంది కుటుంబ సభ్యులను, స్నేహితులను కోల్పోతున్నారు. రికవరీ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉన్నా.. తమకు ఏమైనా అయిపోతుందనే మానసిక ఆందోళన ఎక్కువైపోయింది. మెంటల్ ఇల్‌నెస్ పెరిగిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అటువంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి కొందరు సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఆన్‌లైన్‌లో సాయపడుతున్నారు. ఆ జాబితా మీకోసం..

థెరపైజ్ ఇండియా :

కొవిడ్-19 కారణంగా భయాందోళనకు గురవుతున్న వారికి మెంటల్ హెల్త్‌కేర్ సపోర్ట్ అందిస్తున్న థెరపైజ్ వెబ్‌సైట్.. అతి తక్కువ ఖర్చుతో కౌన్సెలింగ్ సేవలందిస్తోంది. ఇందుకోసం సైకాలజిస్టులతో కూడిన కొవిడ్ సపోర్ట్ సర్కిల్స్‌ను లాంచ్ చేసి, నాలుగు సెషన్ల కోసం రూ.250ల ఫీజు నిర్ణయించింది. ‘గ్రీఫ్, బర్న్ అవుట్, యాంగ్జైటీ’ పేర్లతో ఏర్పాటు చేసిన ఈ గ్రూపులకు శోభిక జాజు, మాన్వి శర్మ, ఆయేషా శర్మ వంటి సైకాలజిస్టులు నేతృత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరి ప్రవర్తనలోనైనా మార్పు కనిపిస్తే లేదా తమ రెగ్యులర్‌ పనులు చేసుకోవడానికి సైతం కష్టపడుతుంటే ఆ ఇబ్బందులను గ్రూప్‌లోని సైకాలజిస్టులతో పంచుకోవచ్చు. బాధితుల్లో కలిగే ఆందోళన, ఎమోషనల్ క్రైసిస్‌కు వారు సరైన పరిష్కారాలు అందిస్తారు.

సెరెనిటీ క్లినిక్ :

డిప్రెషన్, యాంగ్జైటీ, అడిక్షన్, ADHD, బయోపోలార్ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్స్, ఓసీడీ ఇతరత్రా సమస్యలకు ఈ వెబ్‌సైట్ సొల్యూషన్ అందిస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని, ఢిల్లీలో ఉన్న ఈ క్లినిక్ నుంచి వర్చువల్‌ హెల్ప్‌ పొందవచ్చు. ఈ తరహా సమస్యల నుంచి బాధితులు ఎలా బయటపడాలో తెలిపే టిప్స్ అందించడంతో పాటు మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూసే అంశాలపై అవగాహన కల్పిస్తారు. Nagpal (@serenity.clinic)

బెట్టర్‌లైఫ్ :

ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ అండ్ థెరపీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రిలేషన్‌షిప్ బ్రేకప్స్, స్ట్రెస్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడం వంటి మానసిక సమస్యలకు చాట్ లేదా వీడియో ద్వారా ఎక్స్‌పర్ట్స్ సమాధానాలు పొందవచ్చు. ఈ మేరకు వెబ్‌సైట్కౌన్సెలింగ్‌కు సంబంధించి వివిధ రకాల ప్లాన్స్ అందిస్తుండగా.. బాధితులు ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. కాగా థెరపీ చికిత్సలు వద్దనుకునే వారికోసం ఈ వెబ్‌సైట్ వెల్‌నెస్ ప్రోగామ్స్ కూడా కండక్ట్ చేస్తోంది. సెల్ఫ్ లవ్, కైండ్‌నెస్, హ్యుమానిటీకి సంబంధించిన అంశాలపైనా నిపుణుల సలహాలను స్వీకరించవచ్చు. బాధితుల మానసిక ఆందోళనకు కారణమయ్యే అంశాలను విశదీకరించి నిజాలు, అపోహలపై అర్థమయ్యేరీతిలో అవగాహన కల్పిస్తారు.ellness)

హోప్‌క్యూర్ :

క్లినికల్ థెరపీ, బిహేవియరల్, చిల్డ్రన్, టీనేజర్స్ మరియు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వర్చువల్ సెషన్స్ కోసం ఈ వెబ్‌సైట్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. అంతేకాదు కొవిడ్ రికవరీ పేషెంట్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటు తమ ఆప్తులను కోల్పోయిన వారికి ఉచితంగా థెరపీ సెషన్లకు అవకాశం కల్పిస్తోంది.
Con : 9999136056

మైండ్‌ఫిట్ :

మీరు ఇప్పటికే కల్ట్ లేదా Cure.Fit యూజర్ అయితే, మీ యాప్ ద్వారా డైరెక్ట్‌గా ఈ ఫెసిలిటీ పొందవచ్చు. మీకు ఇప్పటికే ఉన్న మెంబర్‌షిప్‌తో థెరపిస్ట్‌ను సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు మెంబర్‌షిప్ లేకపోతే, వెబ్‌సైట్ లేదా యాప్‌లో అందుబాటులో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌తో సెపరేట్ సెషన్‌ బుక్ చేసుకోవచ్చు. Cure.Fit హెడ్ థెరపిస్ట్ డాక్టర్ దివ్య కన్నన్ వీడియో సెషన్స్‌కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

టాక్ టు ఏంజెల్

ఈ వెబ్‌సైట్.. మీరు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకునే ముందే, ఉచితంగా మీ సమస్యకు సంబంధించిన అవగాహనను కల్పిస్తుంది. అంతేకాదు మీకు సంబంధించిన ఎవరికైనా ఇలాంటి సెషన్ అవసరమనుకుంటే వారికోసం ఈ వెబ్‌సైట్ గిఫ్ట్ కార్డ్ అందిస్తోంది. దీంతో వారు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. వాయిస్, వీడియో కాల్స్‌తో పాటు చాట్ సర్వీస్‌ల ద్వారా థెరపీ సెషన్స్ నిర్వహిస్తోంది.

ఫోర్టిస్ హెల్త్‌కేర్ :

మెరుగైన ఆరోగ్య భారత్‌‌కు కృషిచేస్తున్న ఫోర్టిస్.. అతిపెద్ద మెంటల్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌ను కలిగి ఉంది. ఈ మేరకు ఫోర్టిస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు డాక్టర్ సమీర్ పారిఖ్ నేతృత్వం వహిస్తున్నారు. అనేక మంది నిపుణులైన వైద్యులు ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండగా.. మానసిక సంబంధ సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. +918376804102red by Fortis Mental Health (@fortismentalhealth)

ది మైండ్ రీసెర్చ్ ఫౌండేషన్ :

ఈ ఫౌండేషన్.. బిహేవియరల్ సైన్సెస్ మీద బలమైన రుజువులతో కూడిన అప్రోచ్‌తో పనిచేస్తోంది. ఈ మేరకు న్యూరోసైన్స్, పాజిటివ్ సైకాలజీ, హెల్త్ కేర్‌పై దృష్టాసారించింది. కాగా థెరపీ, లైఫ్ కౌన్సెలింగ్, కెరీర్ కౌన్సెలింగ్‌తో పాటు పలు ఫ్యామిలీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది.

డియర్ మైండ్ :

కొవిడ్ -19 కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, ఇతరత్రా మెంటల్ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి స్వాంతన చేకూర్చే లక్ష్యంతో డియర్ మైండ్ ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారికి తన ‘మెంటల్ రీసోర్స్ పోర్టల్’ ద్వారా ఫ్రీ థెరపీ సెషన్స్ నిర్వహిస్తోంది. వలంటీర్లతో నడపబడుతున్న ఈ వెబ్‌సైట్‌లో.. 1-1 కౌన్సెలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం Visit :

Tags:    

Similar News