ఓటరు నమోదు కోసం అవగాహన సదస్సులు
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారిన ఓటర్లుగా నమోదు చేసేందుకు నాలుగు రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేని తెలిపారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని కార్యాలయంలో జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో జిల్లా 5వ వార్షిక క్రీడల నిర్వహణ, నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్, […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ :
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారిన ఓటర్లుగా నమోదు చేసేందుకు నాలుగు రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేని తెలిపారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని కార్యాలయంలో జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో జిల్లా 5వ వార్షిక క్రీడల నిర్వహణ, నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కే.దేవేందర్, కోశాధికారి జె.బాలరాజ్, ఉపాధ్యక్షుడు ఎస్.విక్రమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. ఓటరు నమోదు అవగాహన సదస్సుల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన సెంట్రల్ లైబ్రరీలో, 12వ తేదీన డీఈఓ కార్యాలయంలో, 14వ తేదీన పెన్షన్ పేమెంట్ కార్యాలయంలో, 16వ తేదీన నాంపల్లిలోని జిల్లా కార్యాలయంలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ముజీబ్ హుసేనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.