భారీగా పడిపోయిన ఆటో అమ్మకాలు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో పరిశ్రమలో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా మేలో అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉండటంతో అమ్మకాలు పడిపోయాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు అమ్మకాలు తగ్గాయి. దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి అమ్మకాలు ఏప్రిల్‌తో పోలిస్తే మేలో 71 శాతం తగ్గి 46,555 యూనిట్లుగా నమోదు చేసింది. మరో దిగ్గజం టాటా మోటార్స్ […]

Update: 2021-06-01 11:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో పరిశ్రమలో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా మేలో అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉండటంతో అమ్మకాలు పడిపోయాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు అమ్మకాలు తగ్గాయి. దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి అమ్మకాలు ఏప్రిల్‌తో పోలిస్తే మేలో 71 శాతం తగ్గి 46,555 యూనిట్లుగా నమోదు చేసింది. మరో దిగ్గజం టాటా మోటార్స్ ఏప్రిల్‌తో పోలిస్తే 40 శాతం క్షీణించి 15,181 యూనిట్ల అమ్మకాలుగా పేర్కొంది.

హ్యూండాయ్ సైతం ఏప్రిల్‌తో పోలిస్తే 49 శాతం తక్కువగా 25,001 యూనిట్ల అమ్మకాలను వెల్లడించింది. మహీంద్రా 8,004 యూనిట్ల 56 శాతం అమ్మకాల క్షీణతను ప్రకటించింది. హోండా సంస్థ 2,032 యూనిట్లు, టయోటా 707 యూనిట్లు, ఎంజీ 1,016 యూనిట్ల వాహనాలను మాత్రమే విక్రయించింది. టూ-వీలర్ దిగ్గజ సంస్థ హీరో అమ్మకాలు 50.83 క్షీణించి 183,044 వాహనాలు విక్రయించింది. టీవీఎస్ ఏప్రిల్‌తో పోలిస్తే 30.16 శాతం క్షీణించి 1,66,869 వాహనాలను నమోదు చేసింది. బజాజ్ ఆటో అమ్మకాలు 30 శాతం తగ్గి 2,71,862 యూనిట్లుగా వెల్లడించింది.

Tags:    

Similar News