సమ్మర్ సెగ… ఆటో డ్రైవర్ కూల్ ఐడియా

దిశ, వెబ్ డెస్క్: వేసవి వచ్చేసింది.. భానుడు భగభగమంటున్నాడు.. ఎండలు మండుతున్నాయి. బయటకి వెళ్లాలంటే వేసవి తాపం తట్టుకోలేక జనాలు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మిట్టమధ్యాహ్నం బయటకి వెళ్లాల్సొస్తే ఏసీ క్యాబ్స్ కి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రయాణికులు. ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేసేవారే వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతుంటే.. రోజంతా ఆటో నడిపి జీవించే ఆటో డ్రైవర్ మరింత జాగ్రత్త పడాలి కదా. అందుకే ఆటో డ్రైవర్ ఎమ్.కే. ఇమాముద్దీన్ చక్కటి ప్రయత్నం చేశారు. ఆటో […]

Update: 2021-04-06 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్: వేసవి వచ్చేసింది.. భానుడు భగభగమంటున్నాడు.. ఎండలు మండుతున్నాయి. బయటకి వెళ్లాలంటే వేసవి తాపం తట్టుకోలేక జనాలు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మిట్టమధ్యాహ్నం బయటకి వెళ్లాల్సొస్తే ఏసీ క్యాబ్స్ కి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రయాణికులు. ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేసేవారే వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతుంటే.. రోజంతా ఆటో నడిపి జీవించే ఆటో డ్రైవర్ మరింత జాగ్రత్త పడాలి కదా.

అందుకే ఆటో డ్రైవర్ ఎమ్.కే. ఇమాముద్దీన్ చక్కటి ప్రయత్నం చేశారు. ఆటో టాప్ రెగ్జిన్ (ఆటోలకు కప్పి ఉండే బ్లాక్ షీట్) ఎక్కువ ఎండని గ్రహిస్తుంది. అందుకే తనకి, తన ఆటోలో ప్రయాణిస్తున్నవారికి సమ్మర్ సెగ తగలకుండా ఉండేందుకు ఆటో వెనుక భాగం పచ్చని క్లాత్ తో చుట్టారు ఇమాముద్దీన్. ఆటో టాప్ పై కొబ్బరినార కప్పారు. చూసిన ప్రతి ఒక్కరూ సూపర్ ఐడియా డ్రైవరన్నా అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ దృశ్యాలను సికింద్రాబాద్ ఖార్కానా వద్ద దిశ ప్రతినిధి కెమెరాలో క్లిక్‌మనిపించారు.

Tags:    

Similar News