ఆటో కాంపోనెంట్ పరిశ్రమలో వృద్ధి క్షీణత : ఏసీఎంఏ!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా ప్రస్తుత ఏడాది తొలి అర్ధ భాగంలో 34 శాతం పతనమైన ఆటో పరిశ్రమ, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి క్షీణతను నమోదు చేస్తుందని ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ బాడీ ఏసీఎంఏ బుధవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఆటోమోటివ్ కాంపొనెంట్ పరిశ్రమ టర్నోవర్ రూ. 1.19 లక్షల కోట్లుగా ఉందని, ఇది గతేడాది ఇదే కాలంలో రూ. 1.82 లక్షల కోట్లతో పోలిస్తే 34 శాతం తగ్గిందని […]

Update: 2020-12-16 07:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా ప్రస్తుత ఏడాది తొలి అర్ధ భాగంలో 34 శాతం పతనమైన ఆటో పరిశ్రమ, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి క్షీణతను నమోదు చేస్తుందని ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ బాడీ ఏసీఎంఏ బుధవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఆటోమోటివ్ కాంపొనెంట్ పరిశ్రమ టర్నోవర్ రూ. 1.19 లక్షల కోట్లుగా ఉందని, ఇది గతేడాది ఇదే కాలంలో రూ. 1.82 లక్షల కోట్లతో పోలిస్తే 34 శాతం తగ్గిందని వివరించింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సంబంధిత అంతరాయాల వల్ల ఆటో రంగానికి దాదాపు సున్నా ఆదాయం నమోదైందని, ముఖ్యంగా పరిశ్రమల పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో పనితీరు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మొదటి రెండు త్రైమాసికాల నష్టాల నుంచి పూర్తిగా కోలుకోలేదని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ చెప్పారు.

Tags:    

Similar News