మూడో టెస్టుకు వార్నర్, పకోవస్కీ
దిశ, స్పోర్ట్స్ : బాక్సింగ్‌డే టెస్టులో పరాజయం తర్వాత ఆస్ట్రేలియా తమ జట్టులో భారీ మార్పులు చేయడానికి నిర్ణయించుకుంది. ఓపెనర్ బర్న్స్ వరుసగా విఫలమవుతుండటంతో అతడి స్థానంలో గాయం నుంచి కోలుకున్న డేవిడ్ వార్నర్‌ను తీసుకుంది. అలాగే విల్ పకోవస్కీని కూడా తుది జట్టులో చోటు కల్పించింది. జో బర్న్స్ రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక అర్ద సెంచరీ మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో వరుసగా 8, 51, 0, 4 పరుగులు చేశాడు. […]
దిశ, స్పోర్ట్స్ : బాక్సింగ్‌డే టెస్టులో పరాజయం తర్వాత ఆస్ట్రేలియా తమ జట్టులో భారీ మార్పులు చేయడానికి నిర్ణయించుకుంది. ఓపెనర్ బర్న్స్ వరుసగా విఫలమవుతుండటంతో అతడి స్థానంలో గాయం నుంచి కోలుకున్న డేవిడ్ వార్నర్‌ను తీసుకుంది. అలాగే విల్ పకోవస్కీని కూడా తుది జట్టులో చోటు కల్పించింది. జో బర్న్స్ రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక అర్ద సెంచరీ మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో వరుసగా 8, 51, 0, 4 పరుగులు చేశాడు. దీంతో అతడిని పక్కన పెట్టి వార్నర్‌కు అవకాశం కల్పించారు.
డేవిడ్ వార్నర్, విల్ పకోవస్కీ, షాన్ అబాట్‌లు ఆస్ట్రేలియా జట్టుతో కలుస్తారని, ప్రస్తుతం మెల్‌బోర్న్ చేరుకున్న వీళ్లు జట్టుతో కలసి సాధన చేస్తారని ఆస్ట్రేలియా జాతీయ సెలెక్టర్ ట్రెవర్ హార్న్స్ తెలిపారు. జనవరి 7 నుంచి సిడ్నీలో ప్రారంభం కానున్న మూడో టెస్టులో వార్నర్ స్థానం ఖాయమేనని ఆయన తెలిపారు. అయితే మిగతా ఇద్దరిని తుది జట్టులోకి తీసుకుంటే ఎవరిని తప్పస్తారనేది యాజమాన్యం నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.