త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రద్ధా కపూర్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. ప్రభాస్ ‘సాహో’ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇక తన ఫ్రెండ్, ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధ లవ్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో మాల్దీవ్ వెకేషన్‌కు కలిసి వెళ్లిన ఈ జంట.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. ఈ క్రమంలో శ్రద్ధ ఆంటీ, నటి పద్మిని కొల్హాపురి వీరి పెళ్లి గురించి మేజర్ హింట్ ఇచ్చింది. పద్మిని ఫేమస్ ఓల్డ్ సాంగ్ […]

Update: 2021-12-08 03:47 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. ప్రభాస్ ‘సాహో’ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇక తన ఫ్రెండ్, ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధ లవ్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో మాల్దీవ్ వెకేషన్‌కు కలిసి వెళ్లిన ఈ జంట.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. ఈ క్రమంలో శ్రద్ధ ఆంటీ, నటి పద్మిని కొల్హాపురి వీరి పెళ్లి గురించి మేజర్ హింట్ ఇచ్చింది. పద్మిని ఫేమస్ ఓల్డ్ సాంగ్ ‘యే గలియా యే చౌబారా’ రీక్రియేషన్ సాంగ్‌‌ను స్వయంగా తనే పాడి రిలీజ్ చేయగా.. దీనిపై శ్రద్ధ సూపర్బ్ అని కామెంట్ చేసింది. దీనికిగాను ‘నీ పెళ్లి వేడుకలో ఇదే పాట పడతాను’ అని రిప్లయ్ ఇచ్చింది. దీంతో శ్రద్ధ పెళ్లి త్వరలోనే ఉండబోతోందని అంటున్నారు నెటిజన్లు. అందుకే పద్మిని ఇలాంటి కామెంట్ చేసిందని అభిప్రాయపడుతున్నారు.

దీంతో ఈ విషయంపై పద్మిని కొల్హాపురి తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. శ్రద్ధ, వేదికలను తన మేనకోడళ్లుగా కంటే ఎక్కువ కూతుళ్లుగానే భావిస్తానని.. అందుకే వారి పెళ్లిలలో ఈ పాట పాడతానని చెప్పానని స్పష్టం చేసింది. తన కొడుకు మ్యారేజ్‌లో పాడాలనుకున్నా.. అప్పటికి ఈ సాంగ్ రిలీజ్ కాలేదని చెప్పింది.

Tags:    

Similar News