బ్రేకింగ్.. కలెక్టర్ చాంబర్‌ ముందు వ్యక్తి ఆత్మహత్యయత్నం.. ఏం జరిగిందంటే..

దిశ, డైనమిక్ బ్యూరో : గత 20 ఏళ్లుగా పాసు పుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మరణమే శరణ్యమనుకుని ఓ వ్యక్తి ఏకంగా కలెక్టర్ ఛాంబర్‌లోనే ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్ కలెక్టర్ చాంబర్ ముందు బడిగె మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. అది గమనించిన సిబ్బంది వెంటనే అతనిపై నీళ్లుపోసి అడ్డుకొని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహేష్ […]

Update: 2021-12-13 01:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : గత 20 ఏళ్లుగా పాసు పుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మరణమే శరణ్యమనుకుని ఓ వ్యక్తి ఏకంగా కలెక్టర్ ఛాంబర్‌లోనే ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్ కలెక్టర్ చాంబర్ ముందు బడిగె మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. అది గమనించిన సిబ్బంది వెంటనే అతనిపై నీళ్లుపోసి అడ్డుకొని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఆలేరు మండలం కొనపాకలో దాదాపు 20 ఏళ్ల క్రితం అతని తండ్రి ఉప్పలయ్య 4 ఎకరాలు కొనుగోలు చేశాడని, అప్పటి నుంచి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురై ఇలా చేశానని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమస్యకు పరిష్కారిస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News