దారుణం.. చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అత్యాచారయత్నం

దిశ, నిర్మల్ కల్చరల్: సైదాబాద్ చిన్నారి చైత్ర ఘటన మరవక ముందే నిర్మల్ జిల్లా కేద్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఈద్ గాం ప్రాంతానికి చెందిన రెండున్నర సంవత్సరాల చిన్నారి పై .. 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈద్ గాం కాలనీకి చెందిన ‘చింతల నారాయణ’ అనేవ్యక్తి, అదే కాలనీకి చెందిన చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశచూపి […]

Update: 2021-10-07 03:50 GMT

దిశ, నిర్మల్ కల్చరల్: సైదాబాద్ చిన్నారి చైత్ర ఘటన మరవక ముందే నిర్మల్ జిల్లా కేద్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఈద్ గాం ప్రాంతానికి చెందిన రెండున్నర సంవత్సరాల చిన్నారి పై .. 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈద్ గాం కాలనీకి చెందిన ‘చింతల నారాయణ’ అనేవ్యక్తి, అదే కాలనీకి చెందిన చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశచూపి లైంగికదాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసునమోదుచేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.

చిన్నారిపై లైంగికదాడి ఘటన దురదృష్టకరం: మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కఠిన‌ శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో చిన్నారిపై ఘోరానికి ఒడిగ‌ట్టిన నిందితున్ని పోలీసులు వెంట‌నే అరెస్టుచేసి పొక్సోచ‌ట్టం క్రింద కేసు న‌మోదు చేశార‌ని తెలిపారు. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా ద‌ర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీటు దాఖలు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా పోలీసు శాఖ పరంగా అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. ప్రశాంతమైన నిర్మల్ ప‌ట్టణంలో ఇలాంటి సంఘటన జరుగడం దురదృష్టకరమన్నారు. బాధితుల‌రాలి కుటుంబానికి ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు.

అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్

నిర్మల్ జిల్లా కేంద్రంలో మూడు సంవత్సరాల బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ రామ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితునిపై పోక్సో తో పాటు పలు సెక్షన్ల పై కేసులు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. చిన్నారి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకొని న్యాయం చేస్తామని తెలిపారు. ఎవరు కూడా ఆందోళనకు దిగవద్దని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిఎస్పీ ఉపేంద్ర రెడ్డి పాల్గొన్నారు.

– అదనపు ఎస్పీ రామ్ రెడ్డి

Tags:    

Similar News