సర్కార్ ల్యాండ్‌పై కబ్జాదారుల కన్ను.. డీ1 పట్టాల కలకలం
దిశ, నిర్మల్ రూరల్ : ఆదర్శనగర్, కమలకోట్ గ్రామాల్లో డీ1 పట్టాల కలకలం రేపుతోంది. ప్రభుత్వ భూమిపై కన్నేసిన భూ కబ్జాదారులు ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మామడ మండలంలోని SRSP ముంపు గ్రామమైన ఆదర్శనగర్ అలాగే కమల్‌కోట్ గ్రామల మధ్యలో తండా వద్ద 131 సర్వే నెంబర్‌లో గల దాదాపు 25 […]
దిశ, నిర్మల్ రూరల్ : ఆదర్శనగర్, కమలకోట్ గ్రామాల్లో డీ1 పట్టాల కలకలం రేపుతోంది. ప్రభుత్వ భూమిపై కన్నేసిన భూ కబ్జాదారులు ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం మామడ మండలంలోని SRSP ముంపు గ్రామమైన ఆదర్శనగర్ అలాగే కమల్‌కోట్ గ్రామల మధ్యలో తండా వద్ద 131 సర్వే నెంబర్‌లో గల దాదాపు 25 ఎకరాల నుంచి 30 ఎకరాల భూమిని ముంపునకు గురైన గ్రామానికి ప్రభుత్వం కేటాయించిందని గ్రామస్తులు తెలిపారు. దీనిపై ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తులు కన్నేసి ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో కొద్దిరోజుల క్రితం రెండు గ్రామాలకు చెందిన ప్రజలు స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందించారు. అలాగే ఆ భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించి కాపాడాలని విన్నవించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.