కులాంతర వివాహం చేసుకున్న దంపతులపై దాడి
దిశ, వెబ్‌డెస్క్ : మనసులు కలిసి మనువాడిని జంటపై వధువు బంధువులు విచక్షణరహితంగా దాడి చేశారు. పెళ్లి చేసుకున్న 24 గంటల్లోనే అమ్మాయి తరుఫు వ్యక్తులు అబ్బాయి గ్రామానికి చేరుకోని హల్ చల్ చేశారు. ఇంట్లో ఉన్న నవజంటపై దాడికి పాల్పడ్డారు. కులాలు వేరు కావడంతోనే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామానికి చెందిన వినయ్.. పెన్ పహాడ్ మండలం […]
దిశ, వెబ్‌డెస్క్ : మనసులు కలిసి మనువాడిని జంటపై వధువు బంధువులు విచక్షణరహితంగా దాడి చేశారు. పెళ్లి చేసుకున్న 24 గంటల్లోనే అమ్మాయి తరుఫు వ్యక్తులు అబ్బాయి గ్రామానికి చేరుకోని హల్ చల్ చేశారు. ఇంట్లో ఉన్న నవజంటపై దాడికి పాల్పడ్డారు. కులాలు వేరు కావడంతోనే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామానికి చెందిన వినయ్.. పెన్ పహాడ్ మండలం దూపహాడ్‌కు చెందిన రుచిత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. నవ దంపతులు ఇద్దరు నేరుగా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. అనంతరం యువకుడి స్వగ్రామమైన మర్రికుంటకు రాత్రి చేరుకున్నారు.
వినయ్, రుచితల వివాహం గురించి తెలుసుకున్న వధువు బంధువులు గురువారం మధ్యాహ్నం మూడు ఆటోల్లో మర్రికుంట గ్రామానికి చేరుకోని నవ దంపతులపై దాడి చేశారు. ఆ సమయంలో గ్రామంలో అందరూ వ్యవసాయ పనులకు వెళ్లడంతో వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. వినయ్‌పై విచక్షణ రహితంగా రాళ్లు, కర్రల తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అమ్మాయిపై సైతం దాడి చేస్తూ బలవంతంగా తీసుకెళ్లారు. విజయ్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. అయితే ప్రేమ జంటది వేర్వేరు కులాలు కావడంతోనే అమ్మాయి తరుఫు బంధువులు అబ్బాయిపై దాడి చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.