భూకబ్జాకోరుల బరితెగింపు 

దిశ, మహబూబ్‎నగర్: భూకబ్జా చేశారని సమాచారం ఇచ్చినందుకు సామాన్యులపై కబ్జాదారులు దాడి చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లి శివారులో ఉన్న సర్వే నెంబర్ 523లో మూడు రోజుల నుంచి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకొని రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్మించిన బేస్మెంట్‌లను కూలగొట్టారు. ఈ కబ్జాలో ఒక కౌన్సిలర్‌తో పాటు మరి కొంతమంది పెద్ద నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. […]

Update: 2020-04-20 06:46 GMT

దిశ, మహబూబ్‎నగర్: భూకబ్జా చేశారని సమాచారం ఇచ్చినందుకు సామాన్యులపై కబ్జాదారులు దాడి చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లి శివారులో ఉన్న సర్వే నెంబర్ 523లో మూడు రోజుల నుంచి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకొని రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్మించిన బేస్మెంట్‌లను కూలగొట్టారు. ఈ కబ్జాలో ఒక కౌన్సిలర్‌తో పాటు మరి కొంతమంది పెద్ద నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అధికారులు కూడా పేరుకు వచ్చామా అనట్టుగా వచ్చి కొంత వరకు తొలగింపు చేపట్టి చేతులు దులుపుకొన్నారని స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సమాచారం ఇచ్చినందుకు తమపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. ఈ దాడిలో ఒకరి తలకు గాయాలు కాగా మరొకరి చేయి విరిగింది. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు కౌన్సిలర్ ఇంటి ముందు బైఠాయించారు.

tag: land issue, attack on common man, Invasion, mahabubnagar

Tags:    

Similar News