అతిపెద్ద టోర్నోడో విధ్వంసం.. 50 మందికి పైగా మృతి

కెంటుకీ: యూఎస్‌లోని కెంటుకీలో ఘోర విషాదం నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి టోర్నోడో భీభత్సానికి 50 మందికి పైగా మరణించినట్లు గవర్నర్ అండీ బెషార్ తెలిపారు. సుమారు 200 మైళ్లకు‌పైగా వేగంతో టోర్నోడో విధ్వంసాన్ని సృష్టించిందని వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ‘నేను 50 మందికి పైగా  చనిపోయారని నేను భయపడ్డాను. ఈ విధ్వంసానికి 70 నుంచి 100 మధ్యలో మరణాలు సంభవించి ఉంటాయి’ అని తెలిపారు. కెంటుకీ చరిత్రలో ఇదే […]

Update: 2021-12-11 08:32 GMT

కెంటుకీ: యూఎస్‌లోని కెంటుకీలో ఘోర విషాదం నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి టోర్నోడో భీభత్సానికి 50 మందికి పైగా మరణించినట్లు గవర్నర్ అండీ బెషార్ తెలిపారు. సుమారు 200 మైళ్లకు‌పైగా వేగంతో టోర్నోడో విధ్వంసాన్ని సృష్టించిందని వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ‘నేను 50 మందికి పైగా చనిపోయారని నేను భయపడ్డాను. ఈ విధ్వంసానికి 70 నుంచి 100 మధ్యలో మరణాలు సంభవించి ఉంటాయి’ అని తెలిపారు.

కెంటుకీ చరిత్రలో ఇదే అతిపెద్ద టోర్నోడో విధ్వంసంగా పేర్కొన్నారు. ఒక క్యాండిల్ ఫ్యాక్టరీలో పైకప్పు కూలడంతో మేఫీల్డ్ నగరంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని చెప్పారు. అర్థరాత్రికి ముందే తాను రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని పేర్కొన్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని భారీ అమెజాన్ గోదాంని తుఫాను చీల్చిందని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News