అప్ఘాన్‌లో తాలిబన్ల అత్యుత్సాహం, 17 మంది మృతి

దిశ వెబ్‌డెస్క్: కాబూల్‌లో విషాదం చోటు చేసుకుంది. తాలిబన్లు తమకు తాము పంజ్‌షీర్ ప్రావిన్సును జయించినట్లు ప్రకటించుకుని సంబరాలు జరుపుతూ వైమానిక దళాల ద్వారా కాల్పులు జరపడంతో దాదాపు 17 మంది మరణించినట్లు అంతర్జాతీయ వార్త సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్, ‘పంజ్‌షీర్ ప్రావిన్స్ తాలిబన్ల వశం అయినట్లు ప్రకటించగానే’ ఒక్కసారిగా తుపాకుల గర్జనతో జలాలబాద్ ప్రాంతం మారుమోగిపోయింది. దాంతో 17 మంది అక్కడికక్కడే మరణించగా, దాదాపు 41 మంది […]

Update: 2021-09-04 09:16 GMT

దిశ వెబ్‌డెస్క్: కాబూల్‌లో విషాదం చోటు చేసుకుంది. తాలిబన్లు తమకు తాము పంజ్‌షీర్ ప్రావిన్సును జయించినట్లు ప్రకటించుకుని సంబరాలు జరుపుతూ వైమానిక దళాల ద్వారా కాల్పులు జరపడంతో దాదాపు 17 మంది మరణించినట్లు అంతర్జాతీయ వార్త సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్, ‘పంజ్‌షీర్ ప్రావిన్స్ తాలిబన్ల వశం అయినట్లు ప్రకటించగానే’ ఒక్కసారిగా తుపాకుల గర్జనతో జలాలబాద్ ప్రాంతం మారుమోగిపోయింది. దాంతో 17 మంది అక్కడికక్కడే మరణించగా, దాదాపు 41 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారని రాయిటర్స్ వెల్లడించింది.

దీనిపై స్థానిక తాలిబన్ కమాండర్ మాట్లాడుతూ ‘ సర్వశక్తిమంతుడైన అల్లా దయ ద్వారా, మేము మొత్తం ఆఫ్ఘనిస్తాన్‌పై నియంత్రణ సాధించాము. ఇబ్బంది పెట్టేవారు ఓడిపోయారు, పంజ్‌షీర్ ఇప్పుడు మా ఆధీనంలో ఉంది ” అని వెల్లడించారు. అయితే ఈ ప్రకటనలను రెసిస్టెన్స్ గ్రూప్ ఖండించింది. పంజ్‌షీర్ ఇంక స్వతంత్రంగానే ఉందని తెలిపింది. లోయలో భారీ పోరాటం కొనసాగుతుందని వెల్లడించింది. కాగా, ఇప్పటి వరకు వందలాది మంది తాలిబన్లు ఇందులో చనిపోయారు. “పంజ్‌షీర్ ఆక్రమణల వార్తలు పాకిస్తాన్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. ఇది అబద్ధం ” అని తిరుగుబాటుదారులకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ అన్నారు.

అయితే మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మాట్లాడుతూ తాలిబాన్‌లు, రెసిస్టెన్స్ ఫ్రంట్ జరుపుతున్న సాయుధ పోరాటాన్ని నిలిపివేయాలని కోరారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు తాలిబన్లు శనివారం కూడా తమ ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనను నిలిపివేశారు. కొన్ని కీలక విషయాలపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఇది మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News