మూన్ మిషన్.. అంతరిక్షంలోకి దూసుకుపోనున్న స్నూపీ డాల్..!
దిశ, ఫీచర్స్: వచ్చే ఏడాది నాసా మూన్ మిషన్ ‘ఆర్టెమిస్ I’లోని సిబ్బందిలో అస్ట్రోనాట్ ‘స్నూపీ’ భాగం కానుంది. అమెరికా ప్రఖ్యాత కార్టూనిస్ట్ దివంగత చార్లెస్ ఎమ్. షుల్జ్ పీనట్స్ కామిక్ స్ట్రిప్స్‌లో తొలిసారి ‘స్నూపీ’ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత 1969లో నాసా చేపట్టిన ‘అపోలో 11’ మిషన్‌లో స్నూపీ కూడా ఉండగా, చంద్రుని ఉపరితలంపై వెళ్లిన ప్రపంచంలోని మొట్టమొదటి బీగల్‌గా గుర్తింపు పొందింది. కాగా 60 ఏళ్ల తర్వాత ఇది మళ్లీ అంతరిక్షంలోకి […]
దిశ, ఫీచర్స్: వచ్చే ఏడాది నాసా మూన్ మిషన్ ‘ఆర్టెమిస్ I’లోని సిబ్బందిలో అస్ట్రోనాట్ ‘స్నూపీ’ భాగం కానుంది. అమెరికా ప్రఖ్యాత కార్టూనిస్ట్ దివంగత చార్లెస్ ఎమ్. షుల్జ్ పీనట్స్ కామిక్ స్ట్రిప్స్‌లో తొలిసారి ‘స్నూపీ’ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత 1969లో నాసా చేపట్టిన ‘అపోలో 11’ మిషన్‌లో స్నూపీ కూడా ఉండగా, చంద్రుని ఉపరితలంపై వెళ్లిన ప్రపంచంలోని మొట్టమొదటి బీగల్‌గా గుర్తింపు పొందింది. కాగా 60 ఏళ్ల తర్వాత ఇది మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లనుంది.
అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా స్పేస్‌ఎక్స్ 2020లో చరిత్ర సృష్టించినట్లు తెలిసిందే. డగ్ హార్లీ, బాబ్ బెంకెన్ అంతరిక్ష నౌక క్రూ డ్రాగన్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే ఆస్ట్రోనాట్ బాబ్ బెంకెన్ తనతో పాటు తన కుమారుడు ఆడుకునే స్టఫ్డ్ టాయ్ ‘డైనోసార్’ బొమ్మను వెంటతీసుకెళ్లగా.. ఆ టాయ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. బేబీ యోధ, స్నూపీ నుంచి నిన్నటి డైనోసర్ వరకు అనేక ఐకానిక్ టాయ్స్ రోదసిలోకి ప్రయాణించాయి. ‘జీరో గ్రావిటీ ఇండికేటర్లు’గా ఈ స్టఫ్డ్ టాయ్స్‌ను ఉపయోగించుకోవడమే అందుకు కారణం.
ఆ బొమ్మలు అంతరిక్షంలో గాల్లో తేలుతుంటే క్రూ సిబ్బంది జీరో గ్రావిటీలోకి చేరినట్టేనని తెలుస్తుంది. అయితే 60 ఏళ్ల క్రితం అపోలో మిషన్‌లో భాగమైన స్నూపీ మరోసారి నాసా ‘ఆర్టెమిస్-I’ ప్రొగ్రామ్‌లో భాగం కానుంది. ఇది నాసా నిర్వహిస్తున్న ‘అన్-క్రూడ్’ టెస్ట్ ఫ్లయిట్ కాగా 2022 ప్రారంభంలో మానవులను చంద్రునిపైకి తీసుకువెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ‘అంతరిక్షానికి కొత్తేమీ కాదు’ అంటూ నారింజ రంగులో ఉన్న నాసా ఓరియన్ క్రూ సర్వైవల్ సిస్టమ్ సూట్ ధరించి ఉన్న స్నూపీ ఫొటోను నాసా పంచుకుంది.