ఇంటర్, డిగ్రీ అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. త్వరపడండి..
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ 02/2022 బ్యాచ్ కోసం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: *మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 50 *దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2021 డిసెంబర్ 17. *ఇందులో అసిస్టెంట్ కమాండెంట్లు (గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. *జనరల్ డ్యూటీ(మేల్): […]
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ 02/2022 బ్యాచ్ కోసం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 50
*దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2021 డిసెంబర్ 17.
*ఇందులో అసిస్టెంట్ కమాండెంట్లు (గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*జనరల్ డ్యూటీ(మేల్): 30
*కమర్షియల్ పైలట్ ఎంట్రీ(మేల్/ఫిమెల్): 10
*టెక్నికల్ (ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్) (మేల్): 10
*జనరల్ డ్యూటీకి సంబంధించి 60 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ తో పాటు డిగ్రీ పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 1997 జూలై 01 నుంచి 2021 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
*కమర్షియల్ పైలట్ ఎంట్రీ ఉద్యోగానికి సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 1997 జూలై 01 నుంచి 2021 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
*టెక్నికల్ ఉద్యోగానికి సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్ పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 1997 జూలై 01 నుంచి 2021 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థుల్ని ప్రిలిమనరీ, ఫైనల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.joinindiancoastguard.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.