అసోం రచయిత్రిపై దేశద్రోహం కేసు
గువహతి : మూడు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన 22 మంది జవాన్ల మరణంపై అసోం రచయిత్రి శిఖా శర్మ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని అమరుల్లా ఎలా కీర్తిస్తారని ఆమె ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఫేస్‌బుక్‌లో ఆమె స్పందిస్తూ.. ‘జీతాలు తీసుకుంటూ విధుల్లో మరణించినవారిని అమరవీరులుగా చెప్పలేం. ఒకవేళ ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఎలక్ర్టిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ విద్యుద్ఘాతంతో బలైన ఉద్యోగిని కూడా అమరుడిగానే […]
గువహతి : మూడు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన 22 మంది జవాన్ల మరణంపై అసోం రచయిత్రి శిఖా శర్మ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని అమరుల్లా ఎలా కీర్తిస్తారని ఆమె ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఫేస్‌బుక్‌లో ఆమె స్పందిస్తూ.. ‘జీతాలు తీసుకుంటూ విధుల్లో మరణించినవారిని అమరవీరులుగా చెప్పలేం. ఒకవేళ ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఎలక్ర్టిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ విద్యుద్ఘాతంతో బలైన ఉద్యోగిని కూడా అమరుడిగానే కీర్తించాలి కదా..’ అంటూ రాసుకొచ్చారు. ప్రజల సెంటిమెంట్లతోని ఆడుకోవద్దని మీడియాకు హితువు పలికారు. ఈ పోస్ట్ పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దిస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో తొలుత శిఖాను విచారించిన పోలీసులు.. తర్వాత ఆమెపై సెక్షన్ 294 (ఎ), 124 ఎ (దేశద్రోహం) ల కింద కేసు నమోదు చేశారు.