ప్లాస్మా దాతలకు ప్రభుత్వ ఉద్యోగాలు..
దిశ, వెబ్ డెస్క్: కరోనా బారిన పడి దేశంలో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారే అధికంగా చనిపోతున్నారు. దీంతో వారిని బతికించుకోవాలంటే ప్లాస్మా తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం ప్లాస్మాదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా వారికి బంఫర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ప్లాస్మాదానం చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించింది. […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా బారిన పడి దేశంలో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారే అధికంగా చనిపోతున్నారు. దీంతో వారిని బతికించుకోవాలంటే ప్లాస్మా తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం ప్లాస్మాదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా వారికి బంఫర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ప్లాస్మాదానం చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించింది. ఇతర రాష్ట్రాల వారు కూడా ప్లాస్మాదానం చేయవచ్చని, వారికి కూడా ఇవే ప్రయోజనాలు కల్పిస్తామని స్పష్టంచేసింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ప్రయాణఖర్చులు కూడా కల్పిస్తామని తెలిపింది.