అశ్విన్, సిరాజ్ బౌలింగ్ అద్భుతం : బూమ్రా
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్‌మెన్లపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను 195 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీసుకోగా, అశ్విన్ మూడు, సిరాజ్ రెండు, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసి తొలిరోజు పై చేయి సాధించింది. దీంతో […]
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్‌మెన్లపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను 195 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీసుకోగా, అశ్విన్ మూడు, సిరాజ్ రెండు, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసి తొలిరోజు పై చేయి సాధించింది. దీంతో పలువురు మాజీ ఆటగాళ్లు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేగాకుండా దీనిపై భారత పేసర్ బూమ్రా స్పందిస్తూ.. ‘‘మనల్ని నియంత్రించాలనుకునే వాళ్లను నియంత్రించగలగాలి. మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతీ సెషన్‌కు మెరుగ్గా రాణించాలి. మైండ్‌సెట్ మార్చుకుని కాస్త స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలగాలి. నిర్లక్ష్య ధోరణి వీడి.. రెట్టించిన విశ్వాసంతో ముందుకు సాగాలని భావిస్తున్నాం. అశ్విన్, సిరాజ్ బౌలింగ్ అద్భుతం. బౌలర్లుగా మా ప్రదర్శన నాకు సంతోషాన్నిచ్చింది. ఒకరికొరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాం.’’ అని బూమ్రా వెల్లడించారు.