నిరాల బాబా ‘ఆశ్రమ్’ కథేంటి?

దిశ, వెబ్‌డెస్క్: సొసైటీలో రోజుకో ‘బాబా’ పుట్టుకొస్తూనే ఉన్నాడు. ఇలాంటి వారంతా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసాలు చేస్తూ.. పైకి మాత్రం దేవదూతగా బిల్డప్ ఇస్తుంటారు. భక్తుల బలహీనతల మీద దెబ్బకొడుతూ కోట్లాది రూపాయలు దండుకుంటారు. ఒక్కసారి జనాల్లో ఫేమ్ సంపాదిస్తే చాలు.. నిత్యానంద స్వామిలాగా ఏకంగా ఓ దేశాన్నే సృష్టించి, సపరేట్ కరెన్సీనే అందుబాటులోకి తీసుకురావచ్చు. అయితే, పగలంతా దేవుడిలా కనిపించే బాబా.. రాత్రి ఎలాంటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు? తనకు అడ్డొచ్చిన వారిని ఎలా […]

Update: 2020-09-14 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: సొసైటీలో రోజుకో ‘బాబా’ పుట్టుకొస్తూనే ఉన్నాడు. ఇలాంటి వారంతా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసాలు చేస్తూ.. పైకి మాత్రం దేవదూతగా బిల్డప్ ఇస్తుంటారు. భక్తుల బలహీనతల మీద దెబ్బకొడుతూ కోట్లాది రూపాయలు దండుకుంటారు. ఒక్కసారి జనాల్లో ఫేమ్ సంపాదిస్తే చాలు.. నిత్యానంద స్వామిలాగా ఏకంగా ఓ దేశాన్నే సృష్టించి, సపరేట్ కరెన్సీనే అందుబాటులోకి తీసుకురావచ్చు. అయితే, పగలంతా దేవుడిలా కనిపించే బాబా.. రాత్రి ఎలాంటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు? తనకు అడ్డొచ్చిన వారిని ఎలా మట్టుబెడతాడు? తన దారిలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి కుయుక్తులు పన్నుతాడు? ప్రభుత్వాన్నే తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకునే బాబా.. అపోజిషన్‌కు ఎలాంటి హెల్ప్ చేస్తాడు? ఆ తర్వాత ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు? ఇలాంటి యదార్థ అంశాల ఆధారంగా తెరకెక్కించిన బోల్డ్ కంటెంట్ సిరీస్ ‘ఆశ్రమ్’.

డైరెక్టర్ ప్రకాశ్ ఝా.. ‘ఆశ్రమ్’ సిరీస్‌తో ప్రేక్షకులను సూపర్ థ్రిల్‌కు గురిచేశాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఎగ్జయిట్మెంట్‌ను ప్రతీ క్షణం ఆడియన్స్‌లో కలిగించి సక్సెస్ అందుకున్నాడు. ప్రకాశ్ ఝా స్వయంగా నిర్మించిన ఆశ్రమ్.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌కు తన కెరియర్‌లోనే ‘ది బెస్ట్’ పర్ఫార్మెన్స్ ఇచ్చే చాన్స్ ఇచ్చింది. నటుడిగా తనలోని పొటెన్షియల్‌ను ప్రపంచానికి చూపించింది. నిరాళ బాబాగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన బాబీ డియోల్.. నిజంగా బాబాలు ఇలాగే ఉంటారేమో అనేంతలా జీవించేశాడు. పాత్రలన్నీ చాలా రియలిస్టిక్‌గా, నేచురల్‌గా ఉండగా.. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, లొకేషన్స్, సెట్టింగ్స్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి.

ఎంఎక్స్ ప్లేయర్‌లో రిలీజైన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ సీజన్ 1 తొమ్మిది ఎపిసోడ్స్ ఉండగా.. ఇప్పటికే 207 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. అణగారిన కులానికి చెందిన ఓ యువకుడి పెళ్లి ఊరేగింపునకు సంబంధించి ధనిక వర్గాలతో జరిగిన గొడవలో బాబా.. తక్కువ కులానికి సపోర్ట్ చేసి, వారి ముందే మళ్లీ పెళ్లి ఊరేగింపు జరిపిస్తాడు. ఆ సంఘటనతో పెళ్లి కొడుకు సోదరి బాబాకు అభిమానిగా మారిపోతుంది. తన లక్ష్యాన్ని కూడా వదిలేసి, బాబా సేవకురాలిగా మారేందుకు ఇంట్లో నుంచి పారిపోయి ఆశ్రమానికి చేరుకుంటుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తన సోదరుడు కూడా ఆశ్రమంలోనే ఉండి పని చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ నిజమైన సేవ చేయాలంటే ఆ అబ్బాయి ఒక వేశ్యను పెళ్లాడాలని ఆదేశమిస్తాడు బాబా. బాబా చెప్పినట్టే చేసిన ఆ యువకుడి భార్యపై బాబా చూపు పడ్డాక.. శుద్ధి అనే నెపంతో ఆ అబ్బాయిని ఏం చేశాడు? తన భార్యను ఎలా వశపరుచుకున్నాడు? అనేది ఓ కథ కాగా.. ఫారెస్ట్‌లో దొరికిన మహిళ శవం ఆధారంగా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్షం.. బాబాతో కుదుర్చుకున్న డీల్ ఏంటి? కలలోనూ కలవరపెడుతున్న ఆ మహిళకు, బాబాకు ఉన్న అనుబంధం ఏంటి? అనేది మరో కథ.

ఈ మహిళ హత్య వెనకున్న నిజాలను బయటపెట్టేందుకు పోలీస్ ఆఫీసర్, ఫోరెన్సిక్ డాక్టర్, జర్నలిస్ట్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? మరో స్టోరీలో అణగారిన కులాలకు చెందిన అన్నాచెల్లెళ్లు బాబా నిజస్వరూపం తెలుసుకోగలిగారా? భయంకరమైన రహస్యాలతో కూడిన మిస్టరీ వీడుతుందా? అసలు బాబా గతం ఏంటి? ప్రభుత్వం బాబాను అరెస్ట్ చేయగలిగిందా.? అనేది సెకండ్ సీజన్‌లో తెలియనుంది.

సూపర్ గ్రిప్పింగ్, థ్రిల్లింగ్‌గా ఉన్న ఈ ఆశ్రమ్ సిరీస్‌‌ను మీరూ ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఎంఎక్స్ ప్లేయర్‌లో ఫ్రీగా అవేలేబుల్‌‌గా ఉంది.

Tags:    

Similar News