కనీసవేతనాలు పెంచండి.. కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా..

దిశ, మంచిర్యాల: ఆశా వర్కర్లకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు సంకే రవి, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సోమిడి సమ్మక్క మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకుండ వెట్టి చాకిరి చేయిస్తున్నాయని ఆరోపించారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించిన ఆశా వర్కర్లను ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు. […]

Update: 2021-11-01 11:30 GMT

దిశ, మంచిర్యాల: ఆశా వర్కర్లకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు సంకే రవి, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సోమిడి సమ్మక్క మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకుండ వెట్టి చాకిరి చేయిస్తున్నాయని ఆరోపించారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించిన ఆశా వర్కర్లను ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ ఆషా వర్కర్లకు అమలు చేస్తామని చేప్పి ఇప్పుడు విస్మరించిందన్నారు. వెంటనే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, 11వపీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఫిక్స్ డ్ వేతనం చెల్లించాలని, జాబ్ చార్ట్ ఇవ్వాలని, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఆశా వర్కర్ల తో చేయించవద్దని, జీవిత భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, ఆశా యూనియన్ నాయకురాలు నీరజ, అరుంధతి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News