Minister: మంత్రికి షాక్.. ఆశా వర్కర్ల నిరసన సెగ

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పనికి తగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు సోమవారం ధర్నా చేశారు. తమపై అధిక పని భారం మోపుతున్నారు తప్ప తమ సమస్యల పరిష్కరించడాని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రోగుల బాగోగులు చూస్తూ మేము ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి […]

Update: 2021-05-24 02:07 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పనికి తగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు సోమవారం ధర్నా చేశారు. తమపై అధిక పని భారం మోపుతున్నారు తప్ప తమ సమస్యల పరిష్కరించడాని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా రోగుల బాగోగులు చూస్తూ మేము ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని కలసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హమీ ఇచ్చారు.

Tags:    

Similar News