ఎమ్మెల్యే సీతక్క ఫొటోకు పాలాభిషేకం.. ఎందుకంటే
దిశ, మోత్కూరు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ములుగు ఎమ్మెల్యే సీతక్క అని బహుజన పూజారుల రాష్ట్ర ఇన్చార్జ్ వట్టిపల్లి బిక్షపతి స్వామి అన్నారు. గురువారం గుండాల మండల కేంద్రంలోని సాయి బాబా ఆలయంలో సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఆరు సంవత్సరాలుగా శివ శక్తుల సమస్యలపై ఊరూరా తిరిగి వారిని గుర్తించి మా సంఘం ద్వారా వారికి గుర్తింపు గార్డులు అందచేసాం అన్నారు. గ్రామాల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ […]
దిశ, మోత్కూరు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ములుగు ఎమ్మెల్యే సీతక్క అని బహుజన పూజారుల రాష్ట్ర ఇన్చార్జ్ వట్టిపల్లి బిక్షపతి స్వామి అన్నారు. గురువారం గుండాల మండల కేంద్రంలోని సాయి బాబా ఆలయంలో సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఆరు సంవత్సరాలుగా శివ శక్తుల సమస్యలపై ఊరూరా తిరిగి వారిని గుర్తించి మా సంఘం ద్వారా వారికి గుర్తింపు గార్డులు అందచేసాం అన్నారు. గ్రామాల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేసినా ఎవరు పంటించుకొలేదని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీతక్క మా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి శివశక్తులను మాత్రమే ధూప, దీప , నైవేద్యాల కోసం నియమించాలని ప్రభుత్వాన్ని నిలదీసినందన్నారు.
ఆమె చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు భుష వెంకన్న, మలిపెద్ధి సోమలక్ష్మి, కన్నెబోయిన ఏల మంచమ్మ, కోలిపాక యాదమ్మ, మోటకొండురు మండల అధ్యక్షులు బలగాని మంగమ్మ, భిసు ఇందిరా, యకమ్మ, వళ్ళాల నర్సమ్మ, . సుజాత లు పాల్గొన్నారు.